Tripura Assembly: త్రిపుర అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచే ప్రారంభమయ్యాయి. కాగా.. తొలిరోజే తీవ్ర గందరగోళం నెలకొంది. భారతీయ జనతా పార్టీ మరియు త్రిపుర మోతా ఎమ్మెల్యేల మధ్య సభలో తీవ్ర చర్చ జరిగింది. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు టేబుల్‌పైకి ఎక్కి నానా హంగామా సృష్టించారు. అంతేకాకుండా కొందరు ఎమ్మెల్యేల మధ్య తోపులాట కూడా జరిగింది. అనంతరం ఐదుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
Amitabh Bachchan: మక్కీకి మక్కీ దించేస్తే ఎలా సార్?
అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత అనిమేష్ దెబ్బర్మ ఒక ప్రశ్న అడిగారు. దీంతో ఆ తర్వాత రచ్చ మొదలైంది. వాస్తవానికి అసెంబ్లీలో బిజెపి నాయకుడు పోర్న్ చూస్తున్నారనే అంశాన్ని ప్రతిపక్ష నేత లేవనెత్తారు. దీంతో సభలో హడావుడి నెలకొంది. ఆ తరువాత అసెంబ్లీ స్పీకర్ ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నను తిరస్కరించారు. సభలో అవసరమయ్యే ముఖ్యమైన అంశాలపై చర్చించాలని కోరారు. అయితే దీనిపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. కొద్దికొద్దిగా ఈ నినాదాలు పెద్ద రచ్చగా మారడంతో కొందరు ఎమ్మెల్యేలు టేబుల్‌పైకి ఎక్కి నిరసనకు దిగారు.
Konda Visveshwar Reddy: తెలంగాణలో అభివృద్ది బీజేపీతోనే సాధ్యం
దాదాపు గంటపాటు గందరగోళం కొనసాగడంతో.. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ఐదుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి మాణిక్ సాహా స్పీకర్‌ను కోరారు. దీంతో ఐదుగురు ఎమ్మెల్యేలు బర్మన్, సీపీఎం ఎమ్మెల్యే నయన్ సర్కార్, మరియు టిప్రా మోతాకు చెందిన బృషకేతు దెబ్బర్మ, నందితా రియాంగ్ మరియు రంజిత్ దెబ్బర్మ సభ నుండి సస్పెండ్ అయ్యారు. నిర్ణయాన్ని పునఃపరిశీలించాలన్న వారి అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించడంతో.. విపక్ష సభ్యులందరూ నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.