Kedarnath: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కేదార్‌నాథ్ వార్తల్లో నిలిచింది. ఓ పూజారి చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. ఉత్తరాఖండ్ లో వెలిసి కేదార్‌నాథ్ దేవాలయంలోని గోడలకు స్వర్ణతాపనంలో రూ. 125 కోట్ల కుంభకోణం జరిగిందని
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం అస్సాంలోని శివసాగర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. యూపీఏ పాలనపై మండిపడ్డారు. భారత దేశం 2014 ముందు ఎలా ఉంది.. 2014 తర్వాత ఎలా ఉంది. దేశంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయంటూ ఆయన అన్నారు.
ఢిల్లీ యూనివర్శిటీ సౌత్ క్యాంపస్‌లో హత్య కేసు వెలుగు చూసింది. సౌత్ క్యాంపస్‌లోని ఆర్యభట్ట కళాశాలలో విద్యార్థులు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఇంతలో ఒక విద్యార్థిపై కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో విద్యార్థి మృతి చెందాడు. కత్తిపోట్లకు గురైన విద్యార్థి నిఖిల్ చౌహాన్(19) గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపల పెంపకం మంచి ఆదాయ వనరుగా మారింది. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు చేపల పెంపకం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లోని నర్సింగపూర్ జిల్లా జమునియాకు చెందిన చింటూ సింగ్ సిలావత్ తన పొలంలో చేపల పెంపకం చేస్తూ ఏటా రూ.2.50 లక్షల వరకు మంచి లాభం పొందుతున్నాడు.
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 9 నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జనాలు సతమతమవుతున్నారు. అయితే ఎండల ప్రభావం మనుషులపైనే కాకుండా రైలు పట్టాలపై ప్రభావం చూపింది. ఎండల వేడిమికి రైలు పట్టాలే కరిగిపోయాయి.
కొడుకు పెళ్లి కోసం ఓ తండ్రి తన కులం నుంచి మరొక కులానికి మారాడు. ఈఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగపూర్ జిల్లా కరేలిలో చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలన్న తపనతో.. తన ప్రేమను పొందేందుకు ఓ యువకుడు ముస్లిం నుంచి హిందువుగా మారాడు.
తాగితే మనసులోని నిజాలు బయటకు కక్కేస్తారంటే ఇదేనేమో.. లోనావాలాకు చెందిన అవినాష్ పవార్ అనే వ్యక్తి 1993లో ఒక వృద్ధ జంటను హత్యచేసి.. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారం, విలువైన కొన్ని వస్తువులను దోచుకెళ్లాడు. అవినాష్ పరారీలో ఉండి 30 ఏళ్ళు కింగ్ లా బ్రతికాడు. ఏదైతే నిజం చెప్పకూడనది ఉందో.. ఆ నిజాన్ని ఓ ఫంక్షన్లో ఫుల్ గా తాగి ఆ మర్డర్ గురించి బయటకక్కేశాడు.
గత కొన్ని రోజులుగా రెజ్లర్లు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిరసన చేస్తున్న వారిలో ఓ మైనర్ తన వాంగ్మూలాన్ని మార్చుకుంది. అందుకు సంబంధించి సాక్షి మాలిక్ ఒక వీడియో స్టేట్మెంట్ ద్వారా తెలిపింది. మైనర్ కుటుంబాన్ని బెదిరించారని అందుకే ఆమె తన స్టేట్మెంట్ను మార్చుకున్నట్లు పేర్కొంది.