వ్యవసాయ రంగంపై పలు ప్రశ్నలు సంధిస్తూ.. రైతుల్ని అన్యాయం చేస్తున్నారని సీఎం జగన్‌కు నారా లోకేష్ రాసిన లేఖపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లోకేష్ ఏమైనా హరిత విప్లవ పితామహుడా? లేక వ్యవసాయ రంగ నిపుణుడా? అంటూ ఆయన ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు అయినంత మాత్రాన.. ఏది పడితే అది అడిగేస్తారా? అని ప్రశ్నించారు. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తనకే ఇబ్బందికరంగా ఉందని అన్నారు.…
ఏలూరు జిల్లాలోని గణపవరంలో సీఎం జగన్ ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఆయనకు ఓ లేఖ రాశారు. అందులో రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడిన ఆయన.. పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. రైతురాజ్యం తెస్తానని గద్దెనెక్కి, ఇప్పుడు రైతుల్లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చారంటూ ఆరోపించారు. రైతులకి జరిగిన అన్యాయం, వ్యవసాయ రంగ సంక్షోభంతో పాటు.. జగన్ తండ్రి వైఎస్…
ట్విటర్లో మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయం దగ్గర నుంచి వ్యక్తిగత వ్యవహారాల దాకా వీరి మధ్య వార్ వెళ్ళింది. మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన విషయంపై రాంబాబు చేసిన ట్వీట్‌కి గాను.. కాంబాబు అంటూ అయ్యన్నపాత్రుడు బదులిచ్చినప్పటి నుంచి ఈ ట్విటర్ వార్ వ్యక్తిగతంగా మలుపు తీసుకుంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా.. అప్పట్లో రాంబాబు ఓ…
రాజకీయ, సామాజిక విశ్లేషకుడు సి.నరసింహారావు కన్నుమూశారు. అనారోగ్యంతో అర్థరాత్రి 1.50కి ఆయన తుదిశ్వాస విడిచారు. సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యక్తిత్వ వికాసంపై సి.నరసింహారావు అనేక పుస్తకాలు రాశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సి. నరసింహారావు 1948, డిసెంబర్ 28న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. క్రిష్ణా జిల్లా పెద్దపాలపర్రులో ఆయన జన్మించారు. విజయీభవ, విజయపథం, వ్యక్తిత్వ వికాసం, అన్యోన్య…
ఏపీలో కడప జిల్లాలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఏపీలో మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ కంటే ముందొస్తానని కోట్ల రూపాయల ప్రకటనల ద్వారా జగన్ ప్రచారం చేయించుకున్నారని.. సొంత కడప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెంపున్నెం ఎరుగని దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే గన్ ఎక్కడా? జగన్ ఎక్కడా? అని లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. Crime…
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వివాదంలో మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన వ్యవహారం ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు తారాస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నారాయణ ఫోన్‌ను ట్యాప్ చేశామని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించడం.. అగ్గికి ఆజ్యం పోసినట్టయ్యింది. దీంతో.. ఫోన్ ట్యాప్ చేయడం నేరపూరిత చర్య అని, అందుకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసు రిజిష్టర్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుప్రమాదంలో గాయపడ్డ ఓ లెక్చరర్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ప్రజారోగ్య దేవుడిగా ప్రచారం చేసుకుంటున్న జగన్ వాస్తవానికి ప్రజల పాలిట యముడిలా తయారయ్యాడని నారా లోకేష్ విమర్శించారు. Read Also: Nellore: సర్కారీ ఆస్పత్రిలో ‘శంకర్‌దాదా’లు..…
మంత్రి పదవి తొలగింపు తర్వాత కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న కొడాలి నాని.. ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. సీఎం జగన్‌తో సమావేశం అయ్యాక మీడియాతో మాట్లాడిన ఆయన.. మరోసారి చంద్రబాబుపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు, మోసగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ఎవరు కలిసినా, ఎన్ని గ్రూపులు వచ్చినా.. వారిని చెల్లాచెదురు చేయడానికి సింహం రెడీగా ఉందన్నారు. జగన్‌కు ఉన్న 50 శాతంపైగా ఓట్లు అలాగే ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లోనూ…
ఏపీలో పొత్తు రాజకీయాలపై చర్చలు సాగుతున్న తరుణంలో.. ఎంపీ నందిగం సురేష్ స్పందించారు. చంద్రబాబుకు సింగిల్‌గా వచ్చే దమ్ము లేకపోవడం వల్లే, ‘రండి కలిసి రండి’ అంటూ అడుక్కుంటున్నారని విమర్శించారు. దత్తపుత్రుడితో కలిసి, కుయుక్తులు పన్నాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎంతమంది కలిసి వచ్చినా, జగన్‌ని ఎవరూ కదిపించలేరని వ్యాఖ్యానించారు. 2014, 2019 ఎన్నికల్లో జగన్ సింగిల్‌గా పోటీ చేశారని.. పొత్తులకు వెంపర్లాడలేదని చెప్పారు. సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. గతంలో అగ్రవర్ణాలకు మాత్రమే…
శ్రీసత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును అత్యాచార కేసుగా మారుస్తున్నట్లు ఎస్పీ రాహుల్ దేవ్ వెల్లడించారు. మరోవైపు ఈ కేసును దిశ పోలీసులకు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈనెల 4న గోరంట్ల మండలం మల్లాపల్లి సమీపంలో ప్రియుడు సాదిక్‌కు సంబంధించిన ఓ షెడ్డులో తేజస్విని ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. దీంతో పోలీసులు తొలుత తేజస్విని మృతిని ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు.…