విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకి హాజరయ్యారు టీడీపీ నేత నారా లోకేష్.. 2020లో అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో అచ్చెన్నకు మద్దతుగా ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు లోకేష్.. అయితే, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్ పై కేసు నమోదైంది.. కేసు విచారణలో భాగంగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు.. ఆయనతో పాటు కోర్టుకు హాజరయ్యారు కొల్లు రవీంద్ర.. అయితే, లోకేష్ కోర్టుకు హాజరు సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.. రహదారులు దిగ్బంధించి టీడీపీ నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు.. పోలీసుల తీరుపట్ల తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Anthony Albanese: ఆస్ట్రేలియా ప్రధానిగా ప్రమాణం.. వెంటనే విదేశీ టూర్..
ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. ఏపీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదు.. వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని విమర్శించారు. 55 మంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఒక్క కేసు నిరూపించే పరిస్థితి లేదన్న ఆయన.. ప్రజలు, దళితులపైనా ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. నాపై ప్రభుత్వం ఎన్నో ఆరోపణలు చేసింది.. ఇప్పుడు కోవిడ్ కేసు పెట్టిందని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వంతో పోరాటంలో తగ్గేదేలేదన్నారు నారా లోకేష్.