Nara Lokesh: విశాఖపట్నం కాదది విషాదపట్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు జరగడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్.. ఆయన దోపిడీ గ్యాంగ్ ధనదాహంతో విశాఖపట్నం విషాదపట్నమైంది. అధికారంలోకొచ్చిన నుంచీ ఎల్జీ పాలిమార్స్, సాయినార్ ఫార్మా.. నేడు బ్రాండిక్స్ సెజ్ లో ప్రమాదం జరిగాయన్నారు.
వరుస విషవాయువు లీక్ ఘటనలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లోని సీడ్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకై 200 మంది అస్వస్థతకు గురవడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి. గ్యాస్ లీక్ కి కారణమైన కంపెనీ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
Also Read
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
విషవాయువులు ప్రజల ప్రాణాలు తీస్తున్నా ప్రభుత్వ స్పందన శూన్యం. పోయిన ప్రాణాలకి కోటి పరిహారం ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు సీఎం గారూ..! మరో ప్రాణం పోకుండా భద్రతా చర్యలు తీసుకున్నామని ఎందుకు చెప్పలేకపోతున్నారని లోకేష్ ప్రశ్నించారు. మరోవైపు గ్యాస్ లీకేజీ బాధితులు ఆస్పత్రులకు వస్తూనే వున్నారు. గ్యాస్ లీక్ బాధితుల కు మెరుగైన వైద్య సేవల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. నిపుణులైన వైద్యులను వివిధ ఆసుపత్రుల నుంచి రప్పిస్తున్నారు అధికారులు. ప్రతీ వార్డుకు ఒక్కో స్పెషాలిస్ట్ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికీ అనకాపల్లి ఆసుపత్రికి బాధితులు వస్తుండడంతో అక్కడ బెడ్ లు సరిపోవడం లేదు. మంత్రులు అమర్నాథ్, ముత్యాలనాయుడు బాధితులకు అందుతున్న సదుపాయాలను పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది.
తాజావార్తలు
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
-
Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!