ఇటీవల ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన పదో తరగతి ఫలిలాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులవి ఆత్మహత్యలు కావు ప్రిజనరీ జగన్ ప్రభుత్వ హత్యలే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. జగన్ రివర్స్ పాలనలో రివర్స్ రిజల్ట్స్ వచ్చాయని, టెన్త్ క్లాస్ రిజల్ట్స్ చూసిన తరువాత షాక్ కి గురయ్యానని తెలిపారు. కనీస అవగాహన లేని ప్రిజనరీ వ్యక్తి సీఎం అయితే…
ఏపీలో పదో తరగతి ఫలితాలలో కుట్ర జరిగిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. టెన్త్‌లో ఎక్కువ మంది పాసైతే అమ్మ ఒడితో పాటు ఇంటర్, పాలిటెక్నిక్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే కుట్రతోనే ఎక్కువ మందిని ఫెయిల్ చేశారని మండిపడ్డారు. అయితే ఇది టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదని.. సర్కారు ఫెయిల్యూర్ అంటూ లోకేష్ విమర్శించారు. జగన్ ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన టెన్త్ పరీక్షల్లో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీసుల…
నిన్న ఘర్ణణలో హత్యకు గురైన టీడీపీ బీసీ నాయకుడు జల్లయ్య కుటుంబ సభ్యులను ఫోన్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తోంది సామాజిక అన్యాయమని, ఒక పక్క సామాజిక న్యాయ భేరి అంటూ బస్సు యాత్రలు చేస్తూ మరోపక్క బీసీ నాయకుల్ని పక్కా ప్రణాళికతో హత్యలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బీసీలు తనవైపు లేరనే కక్షతోనే తన సామాజిక వర్గం నేతల్ని బీసీ నాయకుల్ని…
విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు జరగడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్.. ఆయన దోపిడీ గ్యాంగ్ ధనదాహంతో విశాఖపట్నం విషాదపట్నమైంది. అధికారంలోకొచ్చిన నుంచీ ఎల్జీ పాలిమార్స్, సాయినార్ ఫార్మా.. నేడు బ్రాండిక్స్ సెజ్ లో ప్రమాదం జరిగాయన్నారు. వరుస విషవాయువు లీక్ ఘటనలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లోని సీడ్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకై 200 మంది అస్వస్థతకు…
మరోసారి వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు, పోలీసులు, వాలంటీర్లు చేస్తున్న అరాచకాల నుంచి రక్షించే యాప్ ఏదైనా వుంటే ఆరంభించండి సీఎం సారూ! అంటూ సీఎం జగన్‌పై నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడులో మహిళా పోలీసుల అమానవీయ ప్రవర్తనతో సభ్యసమాజం తల దించుకుందని ఆయన ఆరోపించారు. తన ఇంటి ముందు స్థలాన్ని పోలీసులతో వచ్చిన రెవెన్యూ సిబ్బంది…
తెలుగుదేశం పార్టీలో కొత్తరక్తాన్ని నింపి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చంద్రబాబు, నారా లోకేష్‌లు మహానాడు వేదికగా చెప్పుకొచ్చారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఆ మాటలు ఎంతవరకు వర్తిస్తాయనేది ప్రస్తుతం తమ్ముళ్ల ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో ఏలూరు ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తారు? మాజీ ఎంపీ మాగంటి బాబు విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో అతికష్టం మీద టికెట్ సంపాదించి గెలిచారు మాగంటి బాబు. 2019 ఎన్నికల్లో…
వారసత్వ రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే! పార్టీ పగ్గాలు దాదాపు వారసులకే దక్కుతాయి. తరతరాలుగా రాజకీయాల్లో కొనసాగుతోన్న సంస్కృతి ఇది. ఈ నేపథ్యంలోనే టీడీపీ పగ్గాలు నారా లోకేశ్‌కే దక్కుతాయని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. పార్టీ నేతలు అదే చెప్తూ వస్తున్నారు. అయితే.. వారసత్వం ఒక్కటే పరమావధి కాదని, కష్టపడి పని చేసే తత్వం ఉన్న వాళ్ళకే అవకాశం దక్కుతుందని చంద్రబాబు…
ఏపీలో గ్రూప్-1 నిర్వహణలో గూడుపుఠాణీ జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్‌లో భారీ తేడాలు ఉన్నాయని.. దీంతో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్, మాన్యువల్ వేల్యూయేషన్‌లో 202 మంది అవుటయ్యారన్నారు. స్పోర్ట్స్ కోటాలో కోతలు విధించడంతో ఆశావహులు ఆందోళనతో ఉన్నారని ఆరోపించారు. ఈ అవకతవకలపై గవర్నర్ దృష్టి సారించి న్యాయవిచారణ జరపాలని లోకేష్ కోరారు. గ్రూప్ 1 ఇంటర్య్వూల ఎంపికలో…
తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నారు. 72 ఏళ్ల చంద్రబాబు తన వయస్సు గురించిన ఆందోళనలను కూడా పక్కనబెట్టి పార్టీ కోసం శ్రమిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీని గద్దె దించటమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. వీలైనంత ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉండేందుకు టీడీపీ అధినేత ప్రయత్నిస్తున్నారు. వయస్సు గురించి ప్రస్తావిస్తే.. తన వయస్సు గురించి దిగులు చెందాల్సిన పనే లేదంటారాయన. ఆ మాటకొస్తే ప్రధాని మోదీది కూడా…
కొన్ని వార్తాపత్రికలకు చెందిన విలేకరులను ఉద్దేశించి కర్నూలు మేయర్ బీవై రామయ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తే.. వీపులు వాయగొడతామని హెచ్చరించారు. ‘సామాజిక న్యాయభేరి’ సభలో మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉందని ప్రజలు నీడ చాటుకు వెళ్లారని, ఆ సమయంలో ఖాళీగా ఉన్న కుర్చీల ఫోటోలు తీసి సభకు జనాలు రాలేదంటూ కొన్ని పత్రికలు పనికట్టుకుని ప్రచారం చేశాయని ఆయన ఆగ్రహించారు. అలాంటి తప్పుడు వార్తలు రాసిన వారి వీపులు వాయగొడతామని అన్నారు.…