Chandrababu: లోకేశ్‌తో పాటు అందరికీ అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారసత్వ రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే! పార్టీ పగ్గాలు దాదాపు వారసులకే దక్కుతాయి. తరతరాలుగా రాజకీయాల్లో కొనసాగుతోన్న సంస్కృతి ఇది. ఈ నేపథ్యంలోనే టీడీపీ పగ్గాలు నారా లోకేశ్‌కే దక్కుతాయని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. పార్టీ నేతలు అదే చెప్తూ వస్తున్నారు. అయితే.. వారసత్వం ఒక్కటే పరమావధి కాదని, కష్టపడి పని చేసే తత్వం ఉన్న వాళ్ళకే అవకాశం దక్కుతుందని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు.
ది ప్రింట్ కరస్పాండెంట్ రిషిక సదమ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రబాబు.. ఈ సందర్భంగా లోకేశ్‌కు పార్టీ పగ్గాలు ఇచ్చే విషయంతో పాటు భావి తరాల నేతల సత్తాపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పగ్గాలు స్వీకరించే అవకాశం లోకేశ్‌తో పాటు పార్టీలో పని చేసే ప్రతి ఒక్క యువకుడికీ ఉంటుందని చెప్పారు. ఇదే టైంలో.. తరాలు మారుతున్నకొద్దీ నేతల్లో సత్తా తగ్గిపోతోందని కూడా ఆయన బాంబ్ పేల్చారు. తమ తరంలో ఎక్కువ మందిలో సత్తా ఉంటే.. తర్వాతి తరంలో అలాంటి సత్తా కలిగిన నేతలు తగ్గిపోయారని, ఆ తర్వాతి తరంలో అది మరింతగా తగ్గిపోతోందని పేర్కొన్నారు.
Also Read
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకునే దిశగానే టీడీపీ పోరాటం చేస్తోందని చంద్రబాబు అన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా సాగుతున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే పొత్తుల గురించి మాట్లాడిన ఆయన.. పొత్తు అనేది రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరినప్పుడే సాధ్యపడుతుందని, ఎన్నికల సమయంలోనే పొత్తులన్నీ ఏర్పడుతాయని వెల్లడించారు. ఏదేమైనప్పటికీ.. ప్రజల మద్దతు ఉన్న పార్టీలదే విజయం తథ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!