టీడీపీ మహానాడుకి జనం పోటెత్తారు. ప్రకాశం వేదికగా సైకిల్ పార్టీ గుబాళించింది. మహానాడు2022 సందర్భంగా నారా లోకేష్ మీడియాతో ముచ్చటించారు. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ తన పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేశారు. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు.. ప్రజలను హింసించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ కేడరునే హింసిస్తోందన్నారు. ఓ ఎమ్మెల్సీ తన డ్రైవర్, పార్టీ కార్యకర్తనే చంపేస్తే.. మరో ఎమ్మెల్యే తన పార్టీ గ్రామ స్థాయి నేతను హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చగా మారింది.. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్యణ్యాన్ని హత్య చేశాడంటూ అనంతబాబుపై ఆరోపణలు వస్తున్నాయి.. ఈ తరుణంలో.. సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. హత్య చేసిన అనంతబాబు.. సజ్జలను కలిశారంటూ విమర్శించిన ఆయన.. అనంతబాబును మరో 24 గంటల్లో అరెస్ట్ చేయాలి.. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. హత్య చేసి 72 గంటలైతే.. ఇప్పటి వరకు అరెస్ట్…
విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకి హాజరయ్యారు టీడీపీ నేత నారా లోకేష్.. 2020లో అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో అచ్చెన్నకు మద్దతుగా ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు లోకేష్.. అయితే, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్ పై కేసు నమోదైంది.. కేసు విచారణలో భాగంగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు.. ఆయనతో పాటు కోర్టుకు హాజరయ్యారు కొల్లు రవీంద్ర.. అయితే, లోకేష్ కోర్టుకు హాజరు సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.. రహదారులు దిగ్బంధించి టీడీపీ నేతల్ని అడ్డుకున్నారు…
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని విరువూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి కాకాణి. గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో జనాలకు హమీలిచ్చి మోసం చేశారని, రాష్ట్ర ప్రజలని బాది వదిలిపెట్టి ఇప్పుడు మళ్లీ బాదుడే..బాదుడు అంటూ జనాల్లో తిరుగుతున్నారన ఆయన మండిపడ్డారు. వైసీపీ పాలన చూస్తుంటే చంద్రబాబుకు కాళ్ల కింద భూమి కంపిస్తుందని, కేంద్రం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచితే అడిగే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు…
ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. గతంలో ఏపీ సీఎం హోదాలో ఈ సదస్సులకు చంద్రబాబు హాజరైన విషయాన్ని గుర్తు చేస్తూ జగన్ పర్యటనపై సెటైర్లు సంధించారు. గతంలో సీఎం హోదాలో చంద్రబాబు దావోస్లో పర్యటిస్తే.. దావోస్ ఎందుకు డబ్బులు దండగ అన్న జగన్ ఇప్పుడు ఏకంగా స్పెషల్ విమానంలో ఎందుకు అక్కడికి వెళ్లాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బహుశా దేవుడి…
ఏపీలో పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఏపీని బీహార్ కంటే దారుణమైన రాష్ట్రంగా మార్చేసింది వైసీపీ మాఫియా. వైసీపీ నాయకుల నేరాలు, ఘోరాలకి సామాన్యులు బలైపోతున్నారు. తన వద్ద డ్రైవరుగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంని అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతోందన్నారు లోకేష్. ఎమ్మెల్సీ అనంత బాబు తమ కుమారుడ్ని బలవంతంగా తీసుకెళ్లి…
సీఎం జగన్కు, ఆయన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని కామెంట్ చేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. జగన్ పాలనలో పేదల పరిస్థితి అధ్వానంగా ఉందన్న ఆయన.. ఐదుకోట్ల ఆంధ్రుల అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన దళిత మహిళ కర్లపూడి వెంకాయమ్మకి ఈ ప్రభుత్వం ఏ సమాధానం చెబుతుంది..? అని ప్రశ్నించారు. వెంకాయమ్మకు సమాధానం చెప్పే దమ్ములేని వైసీపీ నాయకులు కంతేరులోని ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరిస్తారా? అని మండిపడ్డ ఆయన.. వెంకాయమ్మకి గానీ,…
టీడీపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు వైసీపీ ఎమ్మెల్యేలతో లోపాయికారి ఒప్పందంలో ఉన్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ట్విటర్ మాధ్యమంగా కౌంటర్ ఇచ్చారు. కేవలం నెల్లూరులోనే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తమతో టచ్లో ఉన్నారని.. అందులో రోజూ నీతో మాట్లాడే ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారని అన్నారు. ప్రతిరోజూ నిన్ను, నీ పార్టీని బహిరంగంగా బూతులు తిట్టే ఇంకో ఎమ్మెల్యే కూడా ఉన్నారని.. దమ్ముంటే…
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ మరోసారి పప్పు అని నిరూపించుకున్నారని విమర్శించారు. కిన్నెర ప్రసాద్కు తాను బినామీనని లోకేష్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అసలు బినామీ నువ్వేనంటూ ధ్వజమెత్తారు. అక్రమ లే-ఔట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలియదా? అంటూ నిలదీశారు. టీడీపీలో ఉన్నప్పుడు కిన్నెర ప్రసాద్ నాలుగు లే-ఔట్లు వేశారని గుర్తు చేసిన…
వ్యవసాయ రంగంపై పలు సంచలన ప్రశ్నలు సంధిస్తూ.. సీఎం జగన్కు నారా లోకేష్ రాసిన లేఖతో ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల ఆరోప – ప్రత్యారోపణలు రోజురోజుకీ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కొద్దిసేపటి క్రితమే లోకేష్ ఏమైనా వ్యవసాయ రంగ నిపుణుడా? లేక హరిత విప్లవ పితామహుడా? అంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సెటైర్లు వేయగా.. తాజాగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీపై విరుచుకుపడ్డారు. తమ హయాంలో టీడీపీ ఏం చేసిందో…