టీడీపీలో విషాదం నెలకొంది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు శుక్రవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989-94లో నాగూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కాగా వైసీపీ ఆవిర్భావం తర్వాత శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఆయన…
గన్ కంటే ముందే దూసుకువస్తానన్న జగన్ ఎక్కడా.. ? అంటూ ప్రశ్నించారు నారా లోకేష్.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి వెళ్లిన ఆయన.. దుండగుల అఘాయిత్యానికి బలైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు.. అయితే, లోకేష్ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ దశలో టీడీపీ-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాళ్లు రువ్వుకున్నాయి.. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు.. ఇక, బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. చట్టాలంటే…
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చంద్రబాబు, ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ చీరలు కట్టుకోవాలని రోజా వ్యాఖ్యానించారు. టీడీపీ మహిళా ద్రోహుల పార్టీ అని.. అందరికంటే పెద్ద ఉన్మాది చంద్రబాబే అన్నారు. టీడీపీలో ఉన్నంతమంది ఉన్మాదులు దేశంలోనే లేరని రోజా ఆరోపించారు. మహిళ అని చూడకుండా మహిళా ఛైర్‌పర్సన్‌పై చంద్రబాబు దాడి చేయించారని మండిపడ్డారు. రిషితేశ్వరిని పొట్టనపెట్టుకుంది టీడీపీ నేతలు కాదా అని మంత్రి…
శాప్ ఛైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బైరెడ్డి సిద్దార్థరెడ్డికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియతో పాటు మీడియాను షేక్ చేస్తోంది.. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్‌తో బైరెడ్డికి విభేదాలు బహిరంగ రహస్యమే కాగా.. ఈ మధ్య ఓ పరిణామం చర్చకు దారితీసింది.. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు బైరెడ్డి సిద్ధం అవుతున్నారని.. అందులో భాగంగానే ఈ మధ్యే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో భేటీ అయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి.. అంతేకాదు.. టీడీపీలో చేరి…
నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, వైసీపీ ఇంఛార్జ్, శాప్ ఛైర్మన్‌గా ఉన్న బైరెడ్డి సిద్దార్థరెడ్డి మధ్య తారాస్థాయిలో విభేదాలు ఉన్న సంగతి బహిరంగ రహస్యమే. ఎన్ని విభేదాలు ఉన్నా ఇద్దరూ పార్టీ కార్యక్రమాలతోపాటు.. ప్రభుత్వ ప్రొగ్రామ్స్‌లో చురుకుగా పాల్గొనేవారు. అయితే నాలుగు నెలలుగా సిద్దార్థరెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోందట. ఎందుకలా అనే దానిపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో సిద్దార్థరెడ్డి భేటీ…
ప్రభుత్వ పథకాలు, విధానాలపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. అమ్మ ఒడి పథకంపై సెటైర్లు వేశారు.. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు ఉంది సీఎం వైఎస్ జగన్ అమ్మ ఒడి పథకం తీరు అని దుయ్యబట్టారు.. తేదీల మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 కోత పెట్టి అర్థ ఒడిగా మారిన పథకంపై ఇప్పుడు ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి పథకం…
ఏపీలో విద్యుత్ కోతలు, పవర్ హాలిడే అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. పవర్ హాలిడే ఎత్తేయాలని లోకేష్ కోరారు. పవర్లో వున్న మీరు పవర్ హాలీడే ప్రకటించడం చాలా సులువే. కానీ ఆ ప్రకటన చేసే ముందు కనీసం ఒక్క క్షణం రాష్ట్ర పరిస్థితి ఆలోచించారా? మొన్నటి వరకు కరోనా కష్టాలతో నష్టాల్లో నడిచిన పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కాస్త గాడినపడి పుంజుకుంటుంటే పవర్ హాలిడే…
మరోసారి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. విమర్శలు గుప్పించారు. ‘గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా?.. వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ జగన్ రెడ్డి గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో…
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. అసూయకు మందు లేదని.. ఇంత అసూయతో ఉంటే త్వరగా గుండెపోటు, బీపీలు వస్తాయన్న జగన్ వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అసూయకు అన్న లాంటి వాడు సీఎం జగన్ మోహన్ రెడ్డేనని. అందుకే నాన్న, బాబాయ్‌కు టికెట్ తీసి పంపేశాడని లోకేష్ ఆరోపించారు. మరోసారి సీఎం జగన్ అసూయతో గర్వం దాల్చాడని.. ఈ సారి గుండెపోటు తల్లికో.. చెల్లికో..? అంటూ…