ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్‌ను సందర్శించిన తరుణంలో.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయనపై హాట్ కామెంట్స్ చేశారు. మూడు సంవత్సరాల తర్వాత చంద్రబాబు వైజాగ్‌కి వచ్చారని, ఈ సందర్భంగా ‘అమరావతి అభివృద్ధిని చేస్తాం, విశాఖను రాజధాని చేస్తాం’ అని అమరావతి ప్రజలకు చంద్రబాబు చెప్పొచ్చు కదా అని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 14 సంవత్సరాల కాలంలో రాష్ట్రం కరువుతో ఉందని.. ఆయన రాజకీయాలు చేస్తూ, నారా లోకేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని…
ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడూస్తూనే ఉంది.. ఓవైపు కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తుంటే.. ఇంకో వైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. పెరిగిన ధరలపై బాదుడే బాదుడు పేరుతో ఉద్యమం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన నేతల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతూంది.. అయితే, కుళ్లు, కుతంత్రాలతో టీడీపీపై దుష్ప్రచారం చేస్తూ మాట్లాడడం వల్ల జగన్‌కు, వైసీపీ నేతలకు ఆత్మ సంతృప్తి…
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. నీట్ పీజీ-2022 పరీక్షలు వాయిదా వేయాలని లేఖలో కోరారు. కోవిడ్ కారణంగా గతేడాది నీట్ పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్‌కు అభ్యర్థులు సిద్ధంగా లేరని లోకేష్ తన లేఖలో ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ విద్యార్థుల ఏడాది ఇంటర్న్ షిప్ పూర్తి కాకపోవడంతో వారు నీట్ పీజీ పరీక్షకు అర్హత సాధించే అవకాశం…
పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్, ప్రశ్నాపత్రాల లీకవ్వడంపై టీడీపీ ప్రధాన కార్యకర్శి నారా లోకేష్ సీఎం జగన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే! వైసీపీ వ్యాట్సాప్ గ్రూపుల్లోనే ప్రశ్నాపత్రాలు లీకయ్యాయంటూ ఆరోపణలు చేసిన ఆయన, పదో తరగతి పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అంతేకాదు, దేశ చరిత్రలోనే దీన్నో చీకటి అధ్యాయంగా పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణను తొలగించాలని డిమాండ్ కూడా చేశారు. Read Also: Andhra Pradesh:…
గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌తో పాటు ప్రశ్నాపత్రలు లీక్ అయ్యాయి. మొదటి పరీక్ష మొదలైనప్పటి నుంచి, ఏదో ఒక చోట క్వశ్చన్ పేపర్స్ లీకమవుతూ వస్తున్నాయి. దీంతో, ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై సీఎం జగన్‌కు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. పదో తరగతి పరీక్షల్లో లీక్, మాస్ కాపీయింగ్‌తో విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోందని ఆ…
ఆంధ్రప్రదేశ్ లో అడగడుగునా అత్యాచారాలు, వేధింపులు. అసలు శాంతిభద్రతలు వున్నాయా అనే అనుమానం కలుగుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీలో నేరాలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. విజయవాడ, దుగ్గిరాల, రేపల్లె.. తాజాగా విజయనగరంలో మహిళలపై దారుణ అత్యాచారాలు అందరినీ కలిచివేస్తున్నాయి. మీలో చలనం రావాలంటే ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి జగన్ గారు? అంటూ టీడీపీ నేత నారా లోకేష్ ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో అర్థరాత్రి ఘోరం జరిగినా సీఎం జగన్ మనస్సు కరగదా? అన్నారు. మహిళా…
ఏపీలో ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్… పూటకో రేప్ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. ఇలాంటి ఘటనలతో బీహారును ఏపీ మించిపోయింది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.ఇవాళ ఓ వలసకూలీపై రేపల్లెలో అత్యాచారం జరిగింది. బతుకుదెరువు కోసం భర్త, పిల్లలతో వలసవెళ్లిన మహిళపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో ఏంచేసినా పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారన్నారు లోకేష్. గత నాలుగు రోజులుగా…
తెలంగాణ మంత్రి కేటీఆర్ అభివృద్ధిపై మాట్లాడుతూ.. పక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. అప్పటి నుంచి కేటీఆర్‌పై కౌంటర్ ఎటాక్ మొదలైంది.. ఇక, కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు నారా లోకేష్.. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలకు మీడియాతో పాటు నారా లోకేష్ కూడా వక్రీకరించారని మండిపడ్డారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. ఆయన పక్క రాష్ట్రాలు అన్నారు.. గానీ, ఆంధ్రప్రదేశ్ అని అనలేదని.. ఒక వేళ ఆంధ్ర…
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రచ్చగా మారాయి.. అధికార పార్టీ నేతలు కేటీఆర్‌పై ఫైర్ అవుతుంటూ.. ప్రతిపక్షాలు మాత్రం నూటికి నూరు శాతం ఇది నిజం.. కేటీఆర్ వాస్తవాలే మాట్లాడారని పేర్కొన్నారు.. ఇక, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశారు.. Read Also: Breaking:…
చంద్రబాబు, లోకేష్‌కు చీర పంపిస్తామని మంత్రి రోజా చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. రోజా తనకు చీర పంపిస్తా అంటున్నారని.. ఒకవేళ ఆమె తనకు చీర పంపిస్తే తాను తీసుకుని గౌరవప్రదంగా తన తల్లికి ఇస్తానని లోకేష్ తెలిపారు. అయితే చీర కట్టుకునే మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన మంత్రి రోజా మహిళా సమాజానికి ఆమె క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.…