Be Alert: హైదరాబాద్‌లో మళ్లీ గుప్పుమన్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన.. 1,915 కేజీలు స్వాధీనం
- హైదరాబాద్‌లో మళ్లీ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన గుప్పుమంది
- 1,915 కేజీలు స్వాధీనం
- లాలాగూడలో గుట్టుచప్పుడు కాకుండా కల్తీ అల్లం తయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగంలో కల్కి అవతారం ఎత్తి భగవంతుడు వచ్చినా కల్తీని అంతం చేయలేడేమో..!! యస్.. మీరు విన్నది కరెక్టే..!! మొన్నటికి మొన్న కల్తీ టీ పౌడర్ చూశాం.. నిన్నటికి నిన్న సబ్బులు, షాంపూలు, దోమలను నివారించే మస్కిటో రిపెల్లెంట్స్ కల్తీ చేయడం చూశాం. తాజాగా కల్తీ కేటుగాళ్లు అల్లం పేస్ట్ కల్తీ చేస్తూ పట్టుబడ్డారు. లాలాగూడలో గుట్టుచప్పుడు కాకుండా కల్తీ అల్లం తయారు చేస్తూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
Also Read:Power Bill Hike: విద్యుత్ ఛార్జీల పెంపు.. వివరాలు వెల్లడించిన ఈఆర్సీ
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
కల్తీ..కల్తీ..కల్తీ.. ఎక్కడ చూసినా కల్తీ.. ఏ పదార్థం చూసినా ఏమున్నది గర్వకారణం.. అన్ని ఆహార పదార్థాలు కల్తీమయం.. కొద్దిరోజుల్లో ఇలాంటి మాటలే వినిపిస్తాయి.. హైదరాబాద్‌లో మళ్లీ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన గుప్పుమంది… ఈసారి లాలాగూడలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న కేటుగాళ్లను పట్టుకున్నారు పోలీసులు.
హైదరాబాద్ సిటీ కమిషనర్ పరిధిలోని టాస్క్ ఫోర్స్ బృందం, లాలాగూడ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. లాలాగూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్ సమీపంలో జనావాసాల మధ్యలో కల్తీ కేటుగాళ్లు వ్యాపారం చేస్తున్నారు. ‘ఝాన్సీ’ అల్లం వెల్లుల్లి పేస్ట్ పేరుతో వ్యాపారం చేస్తున్న గోడౌన్‌పై దాడి చేశారు పోలీసులు. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఝాన్సీ కంపెనీ యజమాని నీలం వెంకటేశ్వర్లుగా పేర్కొన్నారు. అతనితోపాటు సూపర్ వైజర్ కె. వినోద్, వర్కర్ టీ సతీష్, మరో వర్కర్ ఎం. శివానిని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!