KMM WIFE MURDER ATTEMPT: కట్టుకున్నోడు కాల్చేశాడు..
- కట్టుకున్నోడే కాల్చేశాడు..
- కన్నీరు పెట్టిస్తున్న ఖమ్మం ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KMM WIFE MURDER ATTEMPT: వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. కొన్నేళ్లుగా అన్యోన్నంగా కాపురం చేస్తున్నారు. కానీ భర్తకు వచ్చి అనారోగ్యం వారి కాపురంలో చిచ్చు పెట్టింది. వృద్ధాప్యంలో.. భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంది ఆ భార్య. కానీ తన అనారోగ్యంతో నిత్యం జీవన్మరణ సమస్య కారణంగా ఆ భర్త ఎవరూ చేయని పని చేశాడు. కట్టుకున్న భార్యపైనే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా తనువు చాలించాడు. అతను కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.. కానీ ఆ వృద్ధురాలు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. తోటమల్ల నాగభూషణంది ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ఆయన స్వస్థలం. తిరుమలాయపాలెంలోనే భార్య జయమ్మతో కలిసి నివాసముంటున్నారు. నాగభూషణం సుతారి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారిద్దరిది అన్యోన్యమైన కాపురం. ఎన్నో ఏళ్ల నుంచి దాంపత్యం సాగిస్తున్నారు. కానీ ఇటీవల నాగభూషణంకు వచ్చిన అనారోగ్యం వారి కాపురంలో చిచ్చురేపింది.
Read Also: CM Revanth Reddy : హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మార్చాలి
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
టీవల కొంతకాలం నుంచి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న నాగభూషణం.. ఆ బాధను భరించలేక పలుసార్లు ఆత్మాహత్యా ప్రయత్నం చేశాడు. అది గమనించిన భార్య జయమ్మ అతడిని ఆత్మహత్య చేసుకోవద్దని వారించింది. అలా పలుమార్లు అడ్డుకుంది. ఆత్మహత్య చేసుకునే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగేవి. అంటే ఆమె తన భర్తపై ఎంత ప్రేమ పెంచుకుందో అర్థమవుతోంది. కానీ నాగభూషణం.. కిడ్నీ సమస్యతో సతమతమవుతూ నిత్యం నరకం అనుభవిస్తున్నాడు. ఈ జీవితం నుంచి విముక్తి కావాలని అనుక్షణం కోరుకున్నాడు. కానీ భార్య తన మాట వినడం లేదని భావించాడు. ఆమె బతికి ఉన్నంత కాలం తనను ఆత్మహత్య చేసుకోనివ్వదని భావించి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. భార్య నిద్రిస్తున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో ఆమె ప్రతిఘటిస్తున్న సమయంలో.. నాగభూషణం కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జయమ్మ కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు ఆమెని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దాదాపు 60 నుంచి 70 శాతం కాలిన గాయాలతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు నాగభూషణం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోస్ట్‌మార్టం అనంతరం డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!