బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని బిష్ణోయ్ వర్గీయులు డిమాండ్ చేయడంతో ఆయన సెక్యూరిటీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయి. అయితే కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్న సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్‌లు తిరిగి మొదలుపెట్టారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం “సికందర్” సినిమా చేస్తున్నాడు. దర్శకుడు AR మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె…
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే భారత జట్టుకు దూరమైన అతడు.. తాజాగా రంజీ ట్రోఫీ జట్టులోనూ స్థానం కోల్పోయాడు. ముంబై రంజీ టీమ్‌లోకి పృథ్వీ షాను ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో అఖిల్ హెర్వాడ్కర్ రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. పృథ్వీ షా పక్కనపెట్టడానికి ముంబై క్రికెట్ అసోసియేషన్ స్పష్టమైన కారణం చెప్పలేదు కానీ.. ఫామ్, ఫిట్నెస్, క్రమశిక్షణారాహిత్యం కారణంగానే వేటు వేసినట్లు తెలుస్తోంది. పృథ్వీ షా ఫామ్…
Virat Kohli and Anushka Sharma at Krishna Das Kirtan in Mumbai: ఆదివారం బెంగళూరు టెస్టు ముగిసిన అనంతరం టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ముంబై చేరుకున్నాడు. విరాట్ ఇక్కడకు చేరుకున్న వెంటనే.. అతను తన భార్య అనుష్క శర్మతో కలిసి ఓ కీర్తన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆదివారం దేశవ్యాప్తంగా ‘కర్వా చౌత్’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జంట కీర్తన కార్యక్రమానికి హాజరై భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకున్నారు. కృష్ణదాస్…
మహారాష్ట్రలోని ముంబైలోని చెంబూర్ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్టేషన్ వెలువల భారీగా ప్రజలు గుమిగూడారు.
Datta Dalvi: ముంబై మాజీ మేయర్ దత్తా దల్వీపై విక్రోలి ప్రాంతంలో దాడి జరిగింది. దాల్వీపై ఓ వీధి వ్యాపారి దాడి చేసినట్లు సమాచారం. కన్నంవర్ నగర్ లోని స్టేషన్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సమాచారం ప్రకారం, దల్వీ శివసేన (యుబిటి) సీనియర్ నాయకుడు పదేళ్లుగా ఈ ప్రాంతానికి కార్పొరేటర్‌గా ఉన్నారు. 45 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డుపై వీధి వ్యాపారి రెండు కూరగాయల…
ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చిందని తెలిపారు. ఈ మెసేజ్ లో సల్మాన్ ఖాన్ నుంచి ఐదు కోట్ల రూపాయలు ఇప్పించాలనే డిమాండ్ ఉందన్నారు. అలాగే, సల్మాన్ ఖాన్ బ్రతికి ఉండి.. లారెన్స్ బిష్ణోయ్‌తో ఉన్న శత్రుత్వాన్ని అంతం చేసుకోవాలంటే.. తమకు 5 కోట్లు చెల్లించాలని ఓ సందేశం గుర్తు తెలియని నంబర్ నుంచి వచ్చింది.
Viral Video: ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఓవర్టేక్ చేసే విషయంలో జరిగిన ఘర్షణలో ఆకాష్ మైన్ అనే వ్యక్తి కొట్టి చంపబడ్డాడు. ఈ ఘటన విషయంలో ముంబైలోని దిండోషి పోలీసులు హత్య కేసు నమోదు చేసి 9 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు వారందరినీ అక్టోబర్ 22 వరకు పోలీసు కస్టడీకి పంపింది. అందిన ప్రాథమిక నివేదికల ప్రకారం.. బాధితుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) సభ్యుడు. మలాద్ ఈస్ట్‌లో ఆటోరిక్షా…
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రిలో చేరారు. ఉద్ధవ్ థాకరే గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయను యాంజియోగ్రఫీ నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Toll-Free Entry: అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై నగరంలోకి ప్రవేశించే టోల్ ప్లాజాల దగ్గర లైట్ మోటార్ వాహనాలకు ఇకపై టోల్ ఫీజు వసూలుచేయబోమని వెల్లడించింది. కార్లు, ఎస్‌యూవీలకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని చెప్పుకొచ్చింది.