నవంబర్ 23 నుండి డిసెంబర్ 15 మధ్య సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 జరుగుతుంది. ఈ టోర్నీ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఎ) ఆదివారం ప్రకటించింది. అందరూ ఊహించినట్టే.. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవరిస్తున్నాడు. అయ్యర్ సారథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానేలు ఆడనున్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల మొదటి మ్యాచ్‌కు సూర్య దూరం కానున్నట్లు తెలుస్తోంది.
రంజీ ట్రోఫీ 2024లో ముంబైకి కెప్టెన్‌గా అజింక్య రహానే ఉన్న విషయం తెలిసిందే. రంజీ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ చెలరేగాడు. రెండు సెంచరీలతో 90.40 సగటుతో 452 పరుగులు చేశాడు. ఒడిశాపై 233 పరుగులు, మహారాష్ట్రపై 142 రన్స్ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా సారథిగా రహానే వ్యహరిస్తాడని తొలుత వార్తలు వినిపించాయి. కానీ ఎంసీఎ మాత్రం శ్రేయస్ వైపు చూపింది. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా రంజీ ట్రోఫీ జట్టు నుండి తొలగించబడ్డ పృథ్వీ షాకు మరలా చోటు దక్కింది. తనుష్ కోటియన్, సిద్ధేష్ లాడ్ కూడా జట్టులోకి వచ్చారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2006-7లో ప్రారంభమైంది. తమిళనాడు తొలి విజేతగా నిలిచింది. 2023-24 సీజన్‌లో ఛాంపియన్‌గా పంజాబ్ నిలిచింది.
Also Read: India vs Malaysia: హైదరాబాద్‌లో ఫిఫా ఫుట్‌బాల్ మ్యాచ్.. మలేసియాతో భారత్ ఢీ!
ముంబై జట్టు:
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, అంగ్క్రిష్ రఘువంశీ, జయ్ బిస్తా, అజింక్య రహానే, సిద్ధేష్ లాడ్, సూర్యాంశ్ షెడ్గే, సాయిరాజ్ పాటిల్, హార్దిక్ తమోర్ (కీపర్), ఆకాశ్ ఆనంద్ (కీపర్), షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, తనుష్ కోటియన్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి, రాయిస్టన్ డయాస్, జునేద్ ఖాన్.