Viral Video: ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఓవర్టేక్ చేసే విషయంలో జరిగిన ఘర్షణలో ఆకాష్ మైన్ అనే వ్యక్తి కొట్టి చంపబడ్డాడు. ఈ ఘటన విషయంలో ముంబైలోని దిండోషి పోలీసులు హత్య కేసు నమోదు చేసి 9 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు వారందరినీ అక్టోబర్ 22 వరకు పోలీసు కస్టడీకి పంపింది. అందిన ప్రాథమిక నివేదికల ప్రకారం.. బాధితుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) సభ్యుడు. మలాద్ ఈస్ట్‌లో ఆటోరిక్షా…
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రిలో చేరారు. ఉద్ధవ్ థాకరే గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయను యాంజియోగ్రఫీ నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Toll-Free Entry: అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై నగరంలోకి ప్రవేశించే టోల్ ప్లాజాల దగ్గర లైట్ మోటార్ వాహనాలకు ఇకపై టోల్ ఫీజు వసూలుచేయబోమని వెల్లడించింది. కార్లు, ఎస్‌యూవీలకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని చెప్పుకొచ్చింది.
Bomb Threat: సోమవారం ముంబై నుంచి జెడ్డా, మస్కట్లకు వెళ్తున్న రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు విమానాలను దూరంగా ఉన్న ‘బే’కు తీసుకెళ్లారు. ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి అవసరమైన అన్ని పరిశోధనలు చేస్తున్నారు. 6E 1275 విమానం ముంబై నుంచి మస్కట్ వెళ్తోంది. మరో ఇండిగో విమానం 6E 56 ముంబై నుంచి జెడ్డాకు వెళ్తోంది. ఈ తెల్లవారుజామున ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు…
Baba Siddique Murder: అజిత్ వర్గం నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో ముంబై పోలీసులు మూడో అరెస్టు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నాయకుడిని హత్య చేసినందుకు బాధ్యత వహిస్తూ పోస్ట్ చేసిన శుభం సోంకర్ సోదరుడు ప్రవీణ్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. పుణెకు చెందిన 28 ఏళ్ల ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మారణకాండలో ముగ్గురిలో ఇద్దరు షూటర్లకు ప్రవీణ్, అతని సోదరుడు సహకరించారని సమాచారం. ప్రవీణ్ సోదరుడు శుభం…
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతలు హాజరయ్యారు. అంతకముందు అంతిమయాత్రకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.
రతన్ టాటా అస్తమయం తర్వాత.. ఆయన ఇష్టపడే శునకం దీనంగా ఎదురుచూస్తోంది. దీంతో పోలీసులు దానిని టాటా భౌతికకాయం దగ్గరకు తీసుకెళ్లి చూపించారు. దీంతో దీనంగా కూర్చుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ratan Tata: ప్రముఖ సామాజిక కార్యకర్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఈరోజు (సోమవారం) ఉదయం ఆయనను ఆసుపత్రిలోని అత్యవసర గదికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రధాని మోడీ శనివారం మహారాష్ట్రలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇక ముంబైలో మెట్రో లైన్-3ను ప్రారంభించారు. అనంతరం బీకేసీ నుంచి శాంతాక్రజ్ స్టేషన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు
అజింక్యా రహానే సారథ్యంలోని ముంబై ఆదివారం ఇరానీ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. ముంబై వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ డ్రా అయింది. లక్నోలోని ఇకాన్ స్టేడియం వేదికగా జరిగిన ఇరానీ కప్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులు చేసింది. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఐదో రోజు ముంబై స్కోరు రెండవ ఇన్నింగ్స్‌లో 329/8 ఉంది. దీంతో.. ఈ మ్యాచ్ డ్రాగా ప్రకటించారు.…