ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా జరిగిన భారత్, న్యూజిలాండ్ 3 టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ముంబైలో జరిగిన మూడో టెస్టులో టీమిండియా విజయం ముందర బొక్కబోర్లా పడింది. దాంతో 25 పరుగులతో కివిస్ విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో 3 – 0 తో క్లీన్ స్వీప్ అయ్యింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకునేందుకు టీమిండియా పరిస్థితి దారుణంగా తయారయింది. ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కచ్చితంగా నాలుగు టెస్టులు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా స్వదేశంలో క్లీన్ స్వీప్ కావడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.
READ MORE: Chardham Yatra 2024: చార్‌ధామ్ యాత్ర.. 6 నెలల్లో 53 మంది భక్తులు మృతి
అయితే ఈ ఘోర పరాజయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. టెస్టు సిరీస్ వైట్‌వాష్ కావడానికి కెప్టెన్‌గా తానే బాధ్యత వహిస్తానని చెప్పాడు. సిరీస్ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టమని.. మరీ ముఖ్యంగా గెలుస్తామనుకున్న ఇలాంటి మ్యాచ్‌ను కోల్పోవడం బాధిస్తుందని తెలిపాడు. తమ స్థాయి క్రికెట్‌ను ఆడలేదనేది మాత్రం స్పష్టమైందన్నాడు. “ఇలాంటి పిచ్‌పై ఎలా ఆడాలనేది పంత్, వాషింగ్టన్ సుందర్ చూపించారు. ఇంకాస్త యాక్టివ్‌గా ఉండాల్సింది. గత నాలుగైదేళ్లుగా దీనిపై చర్చిస్తూనే ఉన్నాం. కెప్టెన్‌గా, ఆటగాడిగా నా ఉత్తమ ప్రదర్శన లేదు. జట్టును సరైన మార్గంలో నడిపించలేదు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత కెప్టెన్‌గా నాదే.” అని రోహిత్ ఆవేదన వ్యక్తం చేశాడు.
READ MORE: Bhumana Karunakar Reddy: చంద్రబాబుతో ఢీ కొట్టడం అంటే ఎప్పుడు సిద్ధమే..