మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగడంతో రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పింది. శనివారం ముగ్గురు మహిళలతో సహా ఆరుగురి హత్య తర్వాత, ఆగ్రహించిన గుంపు బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల దాడి చేశారు. నిరవధిక కర్ఫ్యూ మధ్య, ఎన్‌పీపీ బీజేపీ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో దిగజారుతున్న పరిస్థితులను అదుపు చేయడంలో మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ విఫలమయ్యారని ఎన్పీపీ ఆరోపించింది.
Amit Shah: ఢిల్లీలో సీనియర్ అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు సమావేశం నిర్వహించారు. మణిపూర్‌లో తాజా హింసాత్మక పరిణామాల నేపథ్యంలో భద్రతా పరిస్థితుల్ని సమీక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అధికారులతో ఆయన సమగ్ర సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
మరోసారి మణిపూర్ రగిలిపోతుంది. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ క్రమంలో.. శనివారం ముగ్గురు భారతీయ జనతా పార్టీ, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసాలపై దాడి చేశారు. ఆందోళనకారులు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు మైటీ వర్గానికి చెందిన ఓ ఫ్యామిలినీ కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేయడంతో మరోసారి రాష్ట్రంలో ఉద్రిక్తత ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హత్య చేసిన వారిని 24 గంట్లలో అరెస్ట్ చేసి శిక్షించాలని మైటీ సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు జిరిబం జిల్లాలో ఆరుగురిని దారుణం చంపేసి ఓ నది దగ్గర పడేశారు.
Manipur Violence: హింసాత్మక ఘటనలతో మరోసారి మణిపూర్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్‌లతో పాటు బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్‌పోక్పి, చురచంద్‌పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపేశారు. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆందోళనకారులు పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసిన ఆస్తుల్ని ధ్వంసం చేశారు
Manipur : మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని లామ్‌లై అసెంబ్లీ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో కొండ ప్రాంతం నుండి సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపారు. అనేక బాంబు దాడులకు పాల్పడ్డారు.
Manipur: గతేడాది కాలంలో మణిపూర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణ ఆ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది. ఈ రెండు తెగల మధ్య ఆధిపత్య పోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణలు మతం రంగును పులుముకుంటున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని సేనాపతి జిల్లాలో కొందరు వ్యక్తులు రాత్రిపూట శివాలయాన్ని ధ్వంసం చేశారు.
Manipur : మణిపూర్‌లో గత సంవత్సరం, ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా కోటాల విషయంలో హిందూ-ఆధిపత్యం గల మెయిటీస్, క్రిస్టియన్ కుకీల మధ్య కాలానుగుణంగా హింస చెలరేగింది.
మణిపూర్ హింసలో ఉపయోగించిన బాంబులు, తుపాకుల స్థానంలో ఇప్పుడు రాకెట్లు, డ్రోన్లు వచ్చాయి. రెండు నెలల తాత్కాలిక శాంతి తర్వాత అకస్మాత్తుగా ఈ దాడులు మొదలయ్యాయి.