Manipur Violence: గిరిజన, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకోవడంతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. గత నాలుగు రోజులుగా అక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. స్కూళ్లు, వాహనాలు, చర్చిలకు ఆందోళనకారులు నిప్పుపెడుతున్నారు. సైన్యం, పారామిలిటీ బలగాలను రాష్ట్రంలో మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సైన్యం ప్రకటించింది. పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. సైన్యం, అస్సాం రైఫిల్స్ నుంచి 10,000 మంది సైనికులు మోహరించారు.
Manipur Violence: మణిపూర్ లో గిరిజన, గిరిజనేతరుల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సైన్యం మోహరించింది. మోరే, కాంగ్‌పోక్పి ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని భారత సైన్యం వెల్లడించింది. ఇంఫాల్, చురచంద్‌పూర్ ప్రాంతంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరగుతున్నాయని తెలిపింది. సైన్యంతో పాటు పారామిలిటీరీ ట్రూప్స్ రాష్ట్రంలో మోహరించారు. అస్సాం నుంచి మరిన్ని బలగాలను భారతవాయుసేన కల్లోలిత మణిపూర్ రాష్ట్రానికి చేర్చుతోంది.
Manipur violence: మణిపూర్‌లో ఆందోళన సందర్భంగా చెలరేగిన హింసాకాండ తర్వాత, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది.
Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ హింసాకత్మ సంఘటనలతో అట్టుడుకుతోంది. మెజారిటీ మైతై కమ్యూనిటీని షెడ్యూల్ తెగలో చేర్చే చర్యలను వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఇవి నెమ్మదిగా హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. ప్రార్థనా మందిరాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెడుతున్నారు. ఈ క్రమంలో మణిపూర్ రాష్ట్రంలో ఆర్మీ, అస్సాం రైఫిల్స్ బలగాలు మోహరించాయి.