Manipur Violence: ఆరుగురి హత్యతో మణిపూర్‌లో హింస.. 7 జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్..
- మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస..
- ఇటీవల కిడ్నాప్ అయిన ఆరుగురి హత్య..
- ఏడు జిల్లాలో ఇంటర్నెట్ బంద్..
- ఎమ్మెల్యేల ఇంటిపై నిరసనకారుల దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: హింసాత్మక ఘటనలతో మరోసారి మణిపూర్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్‌లతో పాటు బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్‌పోక్పి, చురచంద్‌పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపేశారు. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆందోళనకారులు పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసిన ఆస్తుల్ని ధ్వంసం చేశారు. సపమ్ నిషికాంత్ సింగ్ ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేసి గేటు ముందు నిర్మించిన బంకర్లను ధ్వంసం చేశారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సగోల్‌బండ్‌లోని ఎమ్మెల్యే ఆర్కే ఇమో ఇంటిపైకి అదే గుంపు దాడి చేసి ఫర్నీచర్, అద్దాలను పగులగొట్టారు.
ఇంఫాల్లో ఖ్వైరాంబండ్ కీథెల్‌లో ఆరుగురిని కిడ్నాప్ చేసి మిలిటెంట్లు హత్య చేశారు. దీంతో నిరసనలు చెలరేగాయి. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం మణిపూర్-అసోం సరిహద్దుల్లోని జిరిబామ్ జిల్లాలోని జిరిముఖ్ అనే మారుమూల గ్రామంలో నదికి సమీపంలో వీరి మృతదేహాలు శుక్రవారం సాయంత్రం కనిపించాయి. మృతదేహాలను అస్సాంలోని సిల్చార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కి తీసుకువచ్చి, పోస్టుమార్టం చేయించారు.
Also Read
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
Read Also: Election Commission: అమిత్ షా, రాహుల్ గాంధీలకు ఈసీ నోటీసులు..
సోమవారం జిరిబామ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఆ సమయంలో సహాయక శిబిరంలో నివసిస్తున్న ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. వారిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారని మైయిటీ వర్గం ఆరోపించింది. నవంబర్ 11న బోరోబెక్రా ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ సమయంలోనే ఆరుగురిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. వీరి ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు మృతదేహాలుగా కనిపించారు.
ఒకటిన్నర సంవత్సరంగా మణిపూర్‌లో కుకీ, మైయిటీ వర్గాల మధ్య జాతి హింస చోటు చేసుకుంది. మణిపూర్‌లో ఉద్రిక్తలు పెరిగాయి. ఇప్పటి వరకు ఈ ఘర్షణ కారణంగా 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
తాజావార్తలు
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు