Manipur: మణిపూర్‌లో శివాలయంపై దుండగుల దాడి..
- మణిపూర్‌లో శివాలయంపై దుండగుల దాడి..
- సేనాపతి జిల్లాలో ఘటన..
- మత విద్వేషాల కోసమే దాడి చేసినట్లు అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: గతేడాది కాలంలో మణిపూర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణ ఆ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది. ఈ రెండు తెగల మధ్య ఆధిపత్య పోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణలు మతం రంగును పులుముకుంటున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని సేనాపతి జిల్లాలో కొందరు వ్యక్తులు రాత్రిపూట శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలోకి చొరబడి శివాలయానికి నిప్పటించారు. దీంతో ఆలయం పాక్షికంగా దెబ్బతింది. రెండు వారాల వ్యవధిలో ఆలయంపై రెండోదాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆలయం మంటలు వ్యాపించడం అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
Read Also: JK Polls: జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంతంగా ముగిసిన రెండో విడత పోలింగ్
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
మంటలు వ్యాపించకుండా స్థానికులు చర్యలు తీసుకున్నారు. నాగా పీపుల్స్ ఆర్గనైజేషన్ (NPO), కరోంగ్-సేనాపతి టౌన్ కమిటీ (KSTC) దుండగుల చర్యల్ని ఖండించారు. శ్రీ శ్రీ పశుపతి నాథ్ మందిరాన్ని తగలబెట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. సేనాపతి శాంతియుతంగా ఉండే పట్టణమని, ఇక్కడ ప్రతీ ఒక్కరూ తమ మతాన్ని ఆచరిస్తారని, సామాజిక ప్రశాంతతని విచ్ఛిన్నం చేసే ఏ చర్యనైనా ఖండిస్తామని రెండు సంస్థలు ప్రకటించాయి. నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసుల్ని కోరారు.
మెయిటీ, కుకీ తెగల హింసాత్మక ఘటనల మధ్య మతపరమైన, జాతి ఉద్రిక్తల్ని సృష్టించేందుకు దుండగులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆలయంపై దాడిని మణిపూర్ రాజ్యసభ ఎంపీ మహారాజా సనజయోబా లీషెంబా ఎక్స్‌లో ఖండించారు. లౌకికవాదానికి విఘాతం కలిగించే ఏ చర్యనైనా ఖండించాల్సిందే అని, దోషులపై కేసులు నమోదు చేయాలని ట్వీట్ చేశారు. రాష్ట్రవాప్యంగా కుకీ మెయిటీ సమస్య ఉన్నప్పటి సేనాపతి మాత్రం ప్రశాంతంగా ఉండని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. గతేడాది నుంచి జరిగిన ఘర్షణల్లో 200 మంది మరణించారు. దాదాపు 50,000 మంది ఇళ్లు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లారు.
Strongly condemn Looting & setting of Shri Pashupati Nath Mandir, Senapati, Manipur on fire at around 1 am of 25/9/24.
Every responsible citizen should condemn such barbaric act bcoz it's an infringement of Secularism. The culprit (s) should be booked at the earliest. @AmitShah pic.twitter.com/U2L0M4Q240— Maharaja Sanajaoba Leishemba. (@MaharajaManipur) September 25, 2024
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!