Manipur violence: మణిపూర్ సర్కార్కు మైటీల డెడ్లైన్.. వారిని 24 గంట్లలో శిక్షించాలని డిమాండ్
- మణిపూర్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్రిక్తత..
- మైటీ వర్గానికి చెందిన వారిని హత్య చేసిన నిందితులను తక్షణమే శిక్షించాలి..
- మా డిమాండ్లను 24 గంటల్లోగా నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు: మైటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur violence: మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగుతుంది. కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు మైటీ వర్గానికి చెందిన ఓ ఫ్యామిలినీ కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేయడంతో మరోసారి రాష్ట్రంలో ఉద్రిక్తత ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హత్య చేసిన వారిని 24 గంట్లలో అరెస్ట్ చేసి శిక్షించాలని మైటీ సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు జిరిబం జిల్లాలో ఆరుగురిని దారుణం చంపేసి ఓ నది దగ్గర పడేశారు. వీరిలో మహిళలు ముగ్గురు ఉండగా మరో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతుల్లో 10 నెలల చిన్నారి ఉండటం తీవ్ర కలకలం రేపుతుంది.
Read Also: Kishan Reddy: ఒట్టేసి చెబుతున్నా.. తులసీ రాంనగర్ లో దుర్గంధం, వాసన రావడం లేదు..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఈ ఘటన స్థానికులని తీవ్రంగా కలచివేసింది. దీంతో, ఇంపాల్‌లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇంఫాల్ వెస్ట్‌లో సగోల్ బంద్‌లో ఉంటోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు నిరసనకారులు ఆందోళనకు దిగారు. రోడ్లపై ఫర్నీచర్లను కాల్చివేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక, పలు జిల్లాలో నిరసనలు పెరగడంతో అధికారులు రెండు రోజులు పాటు 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను బంద్ చేసి కర్ఫ్యూ విధించారు.
Read Also: Amit Shah: ఎన్నికల ర్యాలీలు రద్దు చేసుకున్న అమిత్ షా.. హఠాత్తుగా ఢిల్లీకి ప్రయాణం.. కారణం ఇదే?
అలాగే, ఈ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి రాష్ట్రాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలందరూ కలిసి కూర్చుని కొన్ని నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని మైటీ పౌర హక్కుల సంఘం మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ ప్రతినిధి ఖురైజామ్ అథౌబా తెలిపారు. మణిపూర్ ప్రజలు సంతృప్తి చెందేంత వరకు వారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే, ప్రజల అసంతృప్తిని చవిచూడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అన్ని సాయుధ సమూహాలపై కొన్ని నిర్ణయాత్మక చర్యలు, సైనిక అణిచివేత చర్యలను ఎదుర్కొవల్సి వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతున్నాం.. మిలిటెంట్లపై వెంటనే సైనిక చర్య తీసుకోవాలని కోరారు.
Read Also: Haryana: పెళ్లి జరిగిన మరుసటి రోజే వధువు పరారీ.. భర్తకు, అత్తకి టీలో మత్తు ఇచ్చి..
దీంతో పాటు AFSPAని రద్దు చేయాలని మైటీ పౌర హక్కుల సంఘం మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ ప్రతినిధి ఖురైజామ్ అథౌబా డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా మా డిమాండ్లను నెరవేర్చకుంటే తీవ్ర ప్రజా పోరాటం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మోహరించిన AFSPA బలగాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకెళ్లాలని మణిపూర్ సర్కార్ విజ్ఞప్తి చేసింది.
People stage a protest after bodies of three people from the Meitei community were found, days after they were taken hostage by suspected insurgents from Manipur’s Jiribam district, in Imphal. pic.twitter.com/drpsT9B0iX
— Rajan Chaudhary (@EditorRajan) November 17, 2024
PM आज जब अपने 8000 करोड़ के आलीशान हवाईजहाज में सवार हुए तो लगा Manipur जाएंगे,
लेकिन वो U-turn लेकिन Nigeria चले गए। pic.twitter.com/54fizO5bia
— Srinivas BV (@srinivasiyc) November 16, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!