American Conspiracy India: భారతదేశంలో అగ్రరాజ్యం అమెరికన్ పౌరుల అనుమానాస్పద కార్యకలాపాలపై మరోసారి ప్రశ్నలు బయటికి వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని భివాండిలో చట్టవిరుద్ధమైన మత మార్పిడులను ప్రోత్సహించినందుకు ఒక అమెరికన్ పౌరుడిని అక్కడి అధికారుల అరెస్ట్ చేశారు. ఆయన రిటైర్డ్ యుఎస్ ఆర్మీ మేజర్ అని అధికారులు పేర్కొన్నారు. దీనికంటే ముందు మణిపూర్‌లో డ్రోన్లు, రక్షణ పరికరాలను సరఫరా చేశాడనే ఆరోపణలపై ఒక మాజీ అమెరికా సైనికుడిని భద్రతా అధికారులు అరెస్టు చేశారు. అసలు నిందితుల ఉద్దేశ్యాలు…
Manipur: జాతి వ్యతిరేఖ ఘర్షణలతో గత రెండేళ్లుగా మణిపూర్ అట్టుడుకుతోంది. పరిస్థితి చేజారడంతో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. అయితే, ఇప్పుడు మళ్లీ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తోంది. మాజీ సీఎం బిరేన్ సింగ్ సహా మణిపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించడానికి కేంద్ర నాయకత్వాన్ని కలువనున్నారు. ఈ మేరుకు వారంతా ఢిల్లీ బయలుదేరారు. Read Also: Off The Record : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నిక కాంగ్రెస్…
Manipur: మణిపూర్‌లో ఉగ్రవాదులు అస్సాం రైఫిల్స్ సైనికులు ప్రయాణిస్తున్న ట్రక్కుపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. నలుగురు గాయపడ్డారు. రాజధాని ఇంఫాల్ శివారులో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఇంఫాల్ ఎయిర్ పోర్టు నుంచి 8 కి.మీ దూరంలో ఉనన నంబోల్ సబల్ లైకై ప్రాంతంలో, ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్ ప్రయాణిస్తున్న పారామిలిటరీ దళాల వాహనంపై గుర్తు తెలియని ముష్కరులు కాల్పులు జరిపినట్లు సైన్యం కూడా ధ్రువీకరించింది.
PM Modi Manipur Visit: జాతి ఘర్షణలతో రెండేళ్లుగా అట్టుడుకుతున్న మణిపూర్‌కు ప్రధాని నరేంద్రమోడీ రేపు వెళ్లనున్నారు. మే 2023లో రాష్ట్రంలో చెలరేగిన హింస తర్వాత తొలిసారి ప్రధాని పర్యటనకు వెళ్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధ్రువీకరించారు. ఈ పర్యటన గురించి చాలా రోజుల నుంచి ఊహాగానాలు వెలువడుతున్నప్పటికీ, తొలిసారిగా అధికారిక ప్రకటన వచ్చింది.
Manipur: మణిపూర్‌లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఆ రాష్ట్రంలో గత రెండేళ్లుగా కొనసాగుతున్న హింసనను అడ్డుకుని, శాంతిభద్రతలను పునరుద్ధరించే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాష్ట్రంలోని 5 లోయ ప్రాంత జిల్లాల్లో నిర్వహించిన ఆపరేషన్లలో భారత ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Mallikarjun Kharge: ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ కఠిన పదజాలంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు. మణిపూర్ సంక్షోభం గురించి పట్టించుకోకుండా మోడీ ఎక్కువగా టీవీల్లో కనిపిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని తరుచుగా మీడియాకు రావడాన్ని ఖర్గే తప్పుపట్టారు. మోడీ ప్రతీ రోజూ టీవీల్లో కనిపిస్తారని, ఆయన టీవీ స్ట్రీన్‌పై లేని రోజు లేదని, ప్రభుత్వ టెలివిజన్ దూరదర్శన్ ఉన్నప్పటికీ, గతంలో ఏ ప్రధాని కూడా రోజూ తెల్లవారుజామున టీవీల్లో మొరిగింది లేదని ఖర్గే విమర్శించారు.
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. శనివారం అనేక జిల్లాల్లో హింస చెలరేగింది. దీంతో బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్‌ను నిషేధించారు. శనివారం రాత్రి మెయిటీ సంస్థ నాయకుడు అరంబై టెంగోల్, అనేక మంది ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత హింస చెలరేగింది. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి బస్సులు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ తర్వాత హింసాత్మక ఘర్షణలు ప్రారంభమయ్యాయి.
మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్‌కు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మయన్మార్ సరిహద్దులోని న్యూ సమతాల్ గ్రామం సమీపంలో ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో సమాచారాన్ని పంచుకుంటూ.. భారత సైన్యం తూర్పు కమాండ్ మే 14న, స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలోని ఖెంగ్‌జోయ్ తహసీల్‌లోని…
Manipur: గత రెండేళ్లుగా జాతుల మధ్య ఘర్షణ కారణంగా ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆ రాష్ట్ర సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. కొత్తగా ఎవరూ కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించలేదు. దీంతో కేంద్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.