Manipur Violence: 2023 మే నుంచి ఈశాన్య రాష్ట్రం మణిపూర్ జాతుల సంఘర్షణతో అట్టుడుకుతోంది. హింసలో దాదాపుగా 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మైయిటీ, కుకీల మధ్య నెలకొన్న హింసపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాష్ట్ర ప్రజల్ని క్షమాపణలు కోరారు. గతాన్ని ‘‘క్షమించండి, మరిచిపోంది’’ అని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేశారు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ క్రిస్మస్ రోజున కూడా భారీ కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు ఆనుకుని ఉన్న కొండ జిల్లాలైన ఇంఫాల్ ఈస్ట్, కాంగ్‌పోక్పీ జిల్లాల మధ్య అంతర్ జిల్లా సరిహద్దులోని రెండు గ్రామాల్లో భారీ కాల్పులు జరిగినట్లు భద్రతా దళ వర్గాలు తెలిపాయి.
Revanth Reddy Protest: టిపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం (డిసెంబర్ 18, 2024) “చలో రాజ్‌భవన్” కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఏఐసీసీ పిలుపు మేరకు అదానీ ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మనీ లాండరింగ్ వంటి అంశాలతో పాటు మణిపూర్ అల్లర్లు, విధ్వంసాలపై మోదీ సర్కార్ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఏఐసీసీ. దేశవ్యాప్తంగా ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. Also Read: Today…
Chalo Raj Bhavan: తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకోనుంది. ఈ రోజు హైదరాబాద్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం జరగనుంది. ఈ నిరసనల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అంతటా దేశవ్యాప్త సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ…
మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. వారిలో ఇద్దరు బీహార్‌కు చెందిన కూలీలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని పోలీసులు హతమార్చారు. శనివారం సాయంత్రం కక్చింగ్ జిల్లాలో ఇద్దరు కార్మికులను కాల్చి చంపారు.
Manipur Violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలతో తొమ్మిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇక, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావడంతో దాదాపు 23 రోజుల తర్వాత సోమవారం (డిసెంబర్ 09) మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పునఃప్రారంభించింది.
హింసాత్మాక ఘటనలతో ఇంపాల్, జిరిబామ్ జిల్లాల్లో గత 13 రోజులుగా మూతబడిన పాఠశాలలు, కాలేజీల్లో నేటి (నవంబర్ 29) నుంచి రెగ్యులర్ తరగతులు పునఃప్రారంభించబోతున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
జేపీ నడ్డా రాసిన లేఖలో.. భారత భద్రతా వైఫల్యానికి.. దేశంలోకి విదేశీ ఉగ్రవాదుల అక్రమ వలసలకు కాంగ్రెస్ కారణమని పేర్కొన్నారు. మణిపూర్‌లో పరిస్థితిని మరింత వివాదంగా సృష్టించేందుకు మీ (కాంగ్రెస్) పార్టీ పదే పదే ఎలా ప్రయత్నిస్తుందో అందరు తెలుసని చెప్పుకొచ్చారు.
మణిపూర్‌లో హింస ఆగడం లేదు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా రెండో రోజు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన శాంతిభద్రతలను కాపాడాలని భద్రతా బలగాలు, రాష్ట్ర ఏజెన్సీలకు సూచించారు. రాష్ట్రంలో భద్రత కోసం 50 కంపెనీల అదనపు కేంద్ర పోలీసు బలగాలను షా పంపించారు.