మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఇళ్లలో ఏకకాలం సోదాలు నిర్వహిస్తున్నారు సీబీఐ అధికారులు.. మహారాష్ట్రకు చెందిన ఈ మాజీ మంత్రిపై గతంలో కొన్ని అభియోగాలున్నాయి.. అయితే, ఇప్పుడు జరుగుతోన్న తనిఖీలు ఏ విషయంలో అనేదానిపై స్పష్టత లేదు.. కానీ, మాజీ మంత్రికి చెందిన వివిధ ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. నాగపూర్‌తో పాటు ముంబైలో ఉన్న ఆయన ఇల్లలో తనిఖీలు చేపట్టింది సీబీఐ.. నేరపూరిత కక్ష సాధింపు, అవినీతి ఆరోపణలపై గతంలో అనిల్ దేశ్ముఖ్తో…
ఈరోజు నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం తెరుచుకోబోతున్నది. కరోనా కారణంగా ఏప్రిల్ 5 వ తేదీన ఆలయాన్ని మూసివేశారు. కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి ఆలయాన్ని తెరుస్తున్నారు. ప్రతిరోజూ 15 వేల మంది భక్తులకు మాత్రమే ప్రవేశం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 65 ఏళ్లు దాటినవారు, గర్భిణిలు, పదేళ్లలోపు చిన్నారులకు అనుమతులు లేవని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా పూర్తిస్థాయి కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని,…
కరోనా ఫస్ట్ వేవ్‌తో పాటు సెకండ్ వేవ్ భారత్‌లో కల్లోలమే సృష్టించింది.. అయితే, భారత్‌లో ఎక్కువగా ఇబ్బంది పడింది.. ఎక్కువ కేసులు వెలుగు చూసింది మాత్రం మహారాష్ట్రలోనే.. ఇక, ఆ రాష్ట్ర రాజధాని ముంబైలోనే పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అవుతూ వచ్చాయి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. దీంతో.. మహారాష్ట్రతో పాటు ముంబైలో అక్టోబర్ 4 నుంచి స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం.. మొదట.. 8-12 తరగతుల విద్యార్థులకు భౌతిక క్లాసులు ప్రారంభిస్తామని బృహన్…
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మహారాష్ట్రలో వర్షాల కారణంగా.. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.. ఇక, యావత్మాల్ జిల్లాలో వరదలో బస్సు కొట్టుకుపోయింది.. దాహగాం పుల్మారాలో వాగు వంతెనపై నుంచి వదర నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. మహారాష్ట్ర ఎస్టీ బస్‌ను అలాగే పోనించాడు డ్రైవర్.. అయితే, వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో.. బస్సు కొట్టుకుపోయింది.. ఇక, స్థానికులు అప్రమత్తం అయ్యి.. బస్సులో ఉన్న ఇద్దరిని రక్షించినట్టు…
ప్రముఖ గీత రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ జావేద్ అక్తర్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఆయన ఓ టీవీ ఛానెల్ చర్చా ఘోష్ఠిలో చేసిన వ్యాఖ్యల కారణంగా కోర్టు కేసును ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. థానే లోని కోర్టులో ఒకరు జావేద్ అక్తర్ పై పరువు నష్టం దావా వేశారు. విషయం ఏమంటే… ఆ మధ్య ఓ న్యూస్ టీవీ ఛానెల్ చర్చలో జావేద్ అక్తర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)ను తాలిబన్ల తో పోల్చుతూ…
మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, ఈదురు గాలుల సమయంలో అప్పుడప్పుడు ఆకాశంలోనుంచి వడగళ్లు, చేపలు వంటివి కురుస్తుంటాయి. అయితే, ఉస్మానాబాద్ జిల్లాలోని వశి తాలూకాలో ఓ రైతు పొలంలో పనిచేసుకుంటుండగా, ఒక్కసారిగి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో ఆకాశంలోనుంచి ఓ రాయి హటాత్తుగా ఈ రైతు పొలంలో పడింది. రైతుకు 8 అడుగుల దూరంలో పడిన ఆ రాయిని చూసి రైతు షాక్ అయ్యాడు.…
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోన్న సమయంలో.. ఆ రాష్ట్రంలోని ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది.. అందులో భాగంగా మహారాష్ట్రలోని ప్రఖ్యాత షిర్డీ సాయిబాబా ఆలయాన్ని కూడా మూసివేశారు.. తర్వాతి ఉత్తర్వులు వెలువడేంతవరకూ ఆలయాన్ని మూసే ఉంచనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులు ఏప్రిల్ 5వ తేదీన ప్రకటించారు.. అయితే, కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ వరుసగా ఆలయాలు తెరుచుకుంటున్నాయి.. ఈ నేపథ్యంలో.. షిర్డీ సాయినాథుని ఆలయాన్ని తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.. అక్టోబర్…
సోనూసూద్ ఆస్తులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయ్. వరుసగా మూడో రోజు…తనిఖీలు చేశారు. ముంబైలోని నివాసంతోపాటు.. నాగ్‌పూర్, జైపూర్‌లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు లీకులు ఇస్తున్నారు. సోనుసూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. లక్నోలోని ఓ స్థిరాస్తి సంస్థతో సోనూసూద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థపై పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయ్. అందుకే సోనుసూద్ ఇంట్లో సర్వే చేసినట్లు ఐటీ అధికారులు చెప్పారు.
ఎమ్మెల్యేలకు తమ ప్రాంతంలోని సమస్యలు చెప్పుకుంటూ ప్రజల నుంచి వినతి పత్రాలు వస్తుంటాయి. ఆ పత్రాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే, మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఎమ్మెల్యే సుభాష్ థోతేకు ఓ యువకుడి నుంచి విచిత్రమైన లేఖ వచ్చింది. చంద్రాపూర్ ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని, కాని తనకు ఒక్క అమ్మాయి కూడా పడటం లేదని, ఎంత ప్రయత్నించినా తనకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్ కూడా లేరని, జులాయిగా తిరిగే వాళ్లకు, తాగుబోతులకు కూడా గర్ల్‌ఫ్రెండ్స్…
తెలంగాణలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లడమే కాదు.. గ్రామాలు, పట్టణాల్లోని ముంపు ప్రాంతాల్లో జలమయం అయ్యాయి.. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.. ఇక, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి… ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి వరద నీరు.. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని కందకుర్తి బ్రిడ్జిపై…