దేశంలో ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. క్రమంగా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశంలో 32 కేసులు నమోదయ్యాయి. ఇందులో 17 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ మహారాష్ట్రలోనే అధికంగా ఉంది. తాజాగా మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా ఇందులో మూడు కేసులు ముంబైలోనే నమోదయ్యాయి.
Read: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై అమెరికా సీడీసీ సంచలన వ్యాఖ్యలు… మాస్క్‌లు ధరించకుంటే…
అయితే టాంజానియా నుంచి ముంబైలోని ధారావికి వచ్చిన 45 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. డిసెంబర్ 4న సదరు వ్యక్తి టాంజానియా నుంచి వచ్చాడు. దీంతో ముంబై మున్సిపల్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తికి సంబంధించిన కాంటాక్ట్ లిస్ట్‌ను ట్రేసే చేసేపనిలో ఉన్నారు అధికారులు. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పూర్తిస్థాయిలో ఎయిర్‌పోర్ట్‌లో పరీక్షలు చేస్తున్నారు. అయితే, టాంజానియా దేశం ఎట్ రిస్క్ జాబితాలో లేకపోవడంతో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటకు వచ్చాడు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సాధారణంగానే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
ఇలా పరీక్షలకు పంపిన శాంపిల్స్‌లో టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరడంతో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా అక్కడ ఒమిక్రాన్‌గా నిర్థారణ జరిగింది. వెంటనే ఒమిక్రాన్ వేరియంట్ సోకిన ఆ వ్యక్తిని ఐసోలేషన్ కేంద్రానికి పంపి చికిత్స చేస్తున్నారు. ధారావి మురికివాడలో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసినట్టు వార్తలు బయటకు రావడంతో ఆ ప్రాంతం మొత్తం వణికిపోయింది. రెండున్నర చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏడు లక్షలకు పైగా జనాభా కలిగిన ప్రాంతో ఒమిక్రాన్ వేరియంట్ ఎంటరైతే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ వేవ్ సమయంలో ధారావి నుంచే అత్యధిక కేసులు నమోదయ్యాయి.