Maharashtra Local Body Elections: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్, శివసేన యూబీటీ, ఎన్సీపీ(ఎస్పీ) పార్టీలు చతికిలపడ్డాయి. మొత్తం 286 మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు ఈ రోజు (ఆదవారం) ప్రారంభైంది. రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి మధ్య ప్రత్యక్ష పోరాటం జరిగింది.
Maharashtra: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఒక మహిళ తన స్నేహితురాలిని హోటల్లో కలిసేందుకు వెళ్లిన సమయంలో సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన ఛత్రపతి శంభాజీ నగర్ లోని ఒక హోటల్లో జరిగింది. తాగిన మైకంలో ఉన్న ముగ్గురు ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న 30 ఏళ్ల మహిళ, తన స్నేహితురాలి నుంచి డబ్బు తీసుకునేందుకు హోటల్‌కు వెళ్లింది. Read Also: Bangladesh Violence: బంగ్లా మిషన్ ముందు…
Save Trees Maharashtra: మహారాష్ట్రలోని పంచవటి, తపోవనం ప్రాంతాల్లో గల వేలాది చెట్లు నరికివేతకు ఆ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ నటుడు సాయాజీ షిండే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
స్థానిక ఎన్నికల సమయంలో మహారాష్ట్ర కూటమి ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది. శివసేనకు చెందిన మంత్రి వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య వార్ మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలో మావోల ఏరివేత కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు తమ ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోని మావోయిస్టులను మాత్రం భద్రతా దళాలు అంతమొందిస్తున్నాయి.
Shocking Video: మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్‌నాథ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఎనిమిది మంది గ్యాంగ్ సభ్యులు సుధీర్ ఓంప్రకాశ్ సింగ్ అనే వ్యక్తిపై కత్తులు, కొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. బాధితుడు సుధీర్ సింగ్ తన కారులో విరిగిన భాగాన్ని రిపేర్ చేయించుకోవడం కోసం సమీపంలోని ఆటోమొబైల్ రిపేర్ షాప్ (గ్యారేజ్) వద్దకు వెళ్లారు. అదే సమయంలో అతడిని…
ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా పలువురు వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది తీవ్ర గాయాలతో అంగవైకల్యానికి గురవుతున్నారు. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నాయి రోడ్డు ప్రమాదాలు. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూణేలో ఓ ట్రక్కు పలు వాహనాలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 8 మంది సజీవదహనమయ్యారు. Also Read:MLAs Defection Case:…
Maharashtra: మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో విభేదాలు కనిపిస్తున్నాయి. తాజాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ స్వతంత్రంగా పోటీ చేస్తుందని ప్రకటించారు.
Sunroof: సన్‌రూఫ్ కార్లపై ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. ప్రతీ కంపెనీ తమ ప్రముఖ కార్లకు ఖచ్చితంగా సన్‌రూఫ్ ఆప్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, కొన్ని సందర్భాల్లో ఇవి ఎంత ప్రమాదమో తెలిసే ఘటన చోటు చేసుకుంది. కొండపై నుంచి కారుపై రాయి పడి 43 ఏళ్ల స్నేహల్ గుజరాతీ అనే మహిళ మరణించిన విషాద సంఘటన చోటు చేసుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు సృష్టించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో శరద్‌పవార్ పార్టీకి చెందిన ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.