అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్టు తెలంగాణ రైల్వే పోలీస్ ఎస్పీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అనురాధ వివరాలను వెల్లడించారు. జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా కలిసి తనిఖీలు నిర్వహించారని ఈ తనిఖీల్లో ఇద్దరు మహిళ నిందితుల నుండి రూ. 7లక్షల20 వేల రూపాయలు విలువ చేసే 72 కిలోల గంజాయిని పట్టుకుని సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. నిందితుల్లో మహారాష్ట్ర కు చెందిన…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా 20కిపైగా దేశాల్లో విస్తరించింది. డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరం కావడంతో వేరియంట్‌పై అన్ని దేశాలు అప్రమత్తంగా ఉన్న సంగతి తెలిసిందే. డెల్టా వేరియంట్ పాఠాలను దృష్టిలో పెట్టుకొని ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నారు. కేంద్రం ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలను చేస్తున్నారు. వారిని పరీక్షలు పూర్తయ్యి, రిపోర్ట్ వచ్చే వరకు ఎయిర్ పోర్టులోనే వేచి చూడాల్సి ఉంది. అయితే ,…
ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోన్నది ఒక్కటే.. అదే కరోనా ఒమిక్రాన్ వేరియంట్.. ఇప్పటికే 13 దేశాలను చుట్టేసింది ఈ కొత్త రూపంలోని కోవిడ్.. ఇక, ఈ వేరియంట్ వెలుగుచూసిన సౌతాఫ్రికా నుంచి ఎవరు వచ్చినా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. తాజాగా సౌతాఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానేకు ఓ వ్యక్తికి వచ్చాడు.. అయితే, అతడి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది.. దీంతో అతడిని ఐసోలేషన్‌లో పెట్టారు అధికారులు.. Read Also: భారీ వర్షాల నేపథ్యంలో…
ప్రపంచదేశాలను ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ కలవరపెడుతోంది.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన.. బీ 1.1.529 ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ.. కునుకు లేకుండా చేస్తోంది.. బీ.1.1.529ను ఆందోళనర వేరియెంట్‌గా గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఈ కొత్త వేరియెంట్‌కు ‘ఒమిక్రాన్’ అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే కాగా.. ఈ మహమ్మారితో చాలా దేశాలు అప్రమత్తమై.. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి.. భారత్ కూడా అప్రమత్తం అయ్యింది.. మరోవైపు.. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్.. ఇలా ప్రతీ…
అతి త్వరలో మహారాష్ట్రలో ‘మార్పు’ కనిపిస్తుందని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే గురువారం అన్నారు. రెండు రోజుల రాజస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన మార్చి నాటికి మార్పు కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా లేదా ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలన్నా కొన్ని విషయాలు రహస్యంగా ఉంచాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు వారాల కిందట, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును అధ్యయనం చేయడం కోసం మహారాష్ర్ట ప్రభుత్వ ఇంజనీర్ల బృందం ఆదివారం చేరుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మహారాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్ల దర్శించుకున్నారు. నాగపూర్ ఈఎన్ సి అనిల్ బహుదూరె ఆధ్వర్యంలో 15 ఇంజనీర్ల బృందం ప్రాజెక్టుల ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు వేములవాడలో మీడియా తో మాట్లాడారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ఇంజనీర్ల ప్రతిభ ప్రపంచానికి ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. ఇంత గొప్ప…
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత అన్ని అధునాతనంగా మారిపోతున్నాయి. పాశ్చాత్య దేశాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా మనదేశంలో మౌళిక వసతుల రూపకల్పన జరుగుతున్నది. ఇక రైల్వే స్టేషన్లను, రైల్వే స్టేషన్లలో వసతులను అధునాతనంగా మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముంబైలోని సెంట్రల్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల కోసం అధునతాన రీతిలో జపాన్‌లో ఉండే విధంగా పాడ్ రూమ్స్‌ను ఏర్పాటు చేశారు. Read: ఇంటర్య్వూలకు వెళ్లాలంటే ఇకపై రెజ్యూమ్ అవసరం లేదు.. ఇలా వీడియో చేస్తే చాలట……
మనీలాండరింగ్ కేసులోఈ నెల 2న అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ముంబయి కోర్టు షాకిచ్చింది. అనిల్ దేశ్‌ముఖ్‌కు 14 రోజుల కస్టడీ విధించింది. ఈ సందర్భంగా తనకు రోజూ ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతించాలని అనిల్ దేశ్‌ముఖ్ కోర్టును కోరారు. అయితే ఆయన కోరికను కోర్టు తోసి పుచ్చింది. “ముందుగా జైలు కూడు తినండి. ఒకవేళ తినలేకపోతే అప్పుడు మీ కోరికను పరిగణలోకి తీసుకుంటాం” అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా…
దేశ నేర చరిత్రలోనే అత్యంత హేయమైన సంఘటన మహరాష్ర్టలో ని బీడ్ జిల్లాలో తాజగా వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై 400 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యంత పేదరికంలో నూ తన సొంత కాళ్లపై నిలబడేందుకు ఆమె చేసిన ప్రయత్నాలను ఆసరాగా తీసుకుని పరిచయమైన ప్రతివాడు ఆమెను చెరిచాడు. ఉద్యోగం ఇప్పించకపోగా శారీరక వాంఛను తీర్చుకునేందుకు చూశారు. కాగా పోలీస్‌స్టేషన్‌కు వెళితే అక్కడకూడా పోలీసులు ఆమెను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఇవన్నీ బాలిక…
మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులు జరిపిన ఎనకౌంటర్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మావోయిస్టులు చనిపోయిన విషయాన్ని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ధృవీకరించారు. కాగా గడ్చిరోలి జిల్లా ధనిరా తాలూకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. కొత్గుల్-గ్యారబట్టి ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లినట్లు సమాచారం.…