మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 32 మందికి ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కరోనా సోకింది. అయితే, ఇందులో సగం మంది బాధితులు మహారాష్ట్రలోనే ఉన్నారు. మహారాష్ట్రలో ఇంత వరకూ 17 మంది ఒమిక్రాన్ బారిపడ్డారు. మహారాష్ట్ర నిన్న ఒక్క రోజే ఏడు కొత్త ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. బాధితుల్లో ఒకరు ఓ మూడేళ్ల చిన్నారి కావడం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలోని దార్వీ ప్రాంతానికి చెందిన వ్యక్తికి కూడా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు తేలింది. ఈ వ్యక్తి టాంజానీయా నుంచి భారత్‌కు విచ్చేశాడు.
ఈ వ్యక్తికి ఇంత వరకూ కరోనా వ్యాక్సీన్ తీసుకోలేదు. ఇప్పటికే మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రారంభమైందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శని, ఆదివారాలు రెండు రోజులు జనం గుమిగూడే కార్యక్రమాలపై నిషేధం విధించారు ముంబై పోలీసులు.
డిసెంబర్ 1 నుంచి భారత్ చేరుకున్న విదేశీ ప్రయాణికుల్లో 93 మందికి కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణైంది. వీళ్లలో 83 మంది ఒమిక్రాన్ ప్రభావం అధికంగా గల ఎట్-రిస్క్ దేశాల నుంచి వచ్చారు. మిగతా 13 మంది ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం లేని దేశాలు. డిసెంబర్ 2న కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం మన దేశంలో ఐదు రాష్ట్రాలకు కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించింది.