కొన్ని వస్తువులు ఉన్నట్టుండి కదులుతుంటాయి. అవి ఎందుకు అలా కదులుతాయో తెలియదుగాని అలాంటి విషయాలు మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఆ విషయాల గురించి నెటిజన్లు కామెంట్లు, షేర్లు చేస్తుంటారు. కొంతమంది వాటికి అద్భుత శక్తులు ఉన్నాయని చెబితే, మరికొందరు మాత్రం వాటిని దెయ్యాలుగా చెబుతుంటారు. ఇలాంటి న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. అది నాగపూర్‌లోని శతాబ్దినగర్ ప్రాంతం. రాజేంద్ర అనే ఆటో డ్రైవర్ తన ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలో వింతఆకారానికి…
కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి వచ్చింది లేదు.. మరోవైపు థర్డ్ వేవ్ భయలు వెంటాడుతున్నాయి.. ఇక, కొత్త కొత్త వేరియంట్లు వెలుగుచూస్తూనే ఉన్నాయి… మరోవైపు కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే జికా వైరస్ కేసులు నమోదు కాగా.. ఇప్పుడు మహారాష్ట్రలో జికా వైరస్ కేసు వెలుగు చూసింది.. దీంతో.. దానిపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రం.. వెంటనే కొంత మంది వైద్య నిపుణుల బృందాన్ని మహారాష్ట్రకు పంపించింది.. జికా వైరస్, అక్కడి పరిస్థితులపై ఆ వైద్య…
తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. పలు ప్రాంతాలను వరదలతో ముంచెత్తాయి. ఇక, భారీవర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలో మూడు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 36 మంది మరణించినట్టు అధికారులు చెబుతున్నారు.. మరికొంతమంది గల్లంతు కాగా.. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి.. ఇప్పటికే కొందరిని కాపాటినట్టు తెలుస్తుండగా.. శిథిలాల కింది ఎంతమంది చిక్కుకున్నారనేదానిపై వివరాలు లేవు..…
గత కొన్ని రోజులుగా ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పాతకాలం నాటి ఇళ్లు కూలిపోతున్నాయి. అటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ముంబైలో ఇప్పటి వరకు 23 మంది మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల పాటు ముంబై నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. దీంతో…
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు… ఓ చిరుత స్కూల్ క్యాంటిన్‌లోకి దూరింది. విషయం తెలుసుకున్న క్యాంటిన్ సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు, వైల్డ్ లైఫ్ సంస్థకు సమాచారం అందించారు. హుటాహుటిన అటవిశాఖాధికారలు, వైల్డ్ లైప్ సిబ్బంది దాదాపు నాలుగు గంటలపాటు రెస్క్యూ చేసి చిరుతను బందించి అడవిలో వదిలేశారు. Read: “వాలిమై” యూరప్ ట్రిప్ ? చిరుతకు గాయాలు కావడంతో అది క్యాంటిన్‌లోకి వచ్చి ఉండోచ్చని అధికారులు చెబుతున్నారు. వైల్డ్‌లైఫ్ ఎస్ఒఎస్ సంస్థ చిరుత రెస్క్యూకి…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, మహారాష్ట్రలో మాత్రం కేసులు తగ్గడంలేదు. మహారాష్ట్రలోని 8 జిల్లాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కొల్హాపురి, సాతారా, పాల్ఘాట్, రాయ్‌గడ్, సంధూదుర్గ్, రత్నగిరి, పూణే రూరల్, సాంగ్లీ జిల్లాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తొంది. కరోనా కేసులతో పాటుగా అటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం రోజున 8,535 కేసులు నమోదవ్వగా 158 మరణాలు నమోదయ్యాయి. 8 జిల్లాల నుంచే అధికంగా కేసులు వస్తుండటంతో ప్రభుత్వ యంత్రాంగం…
కేంద్ర కేబినెట్ విస్తరణపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా.. చివరకు ముహూర్తం పెట్టేశారు.. రేపు సాయంత్రం కొత్త కేబినెట్ కొలువు తీరనుంది.. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో 20 మందికి పైగా కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది.. ఇదే సమయంలో.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత దూరమైన బీజేపీ-శివసేన మళ్లీ ఒక్కటి కానున్నాయనే ప్రచారం ఊపందుకుంది… అందులో భాగంగా శివసేన కేంద్ర కేబినెట్లోనూ చేరుతుందనే గుసగుసలు వినిపించాయి.. అయితే, ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు శివసేన చీఫ్, మహారాష్ట్ర…
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. రాజకీయాల్లో ఎవరికి ఎవరూ శతృవులు కాదు, ఎవరూ శాశ్వత మిత్రులూ కాదు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్నికల్లో ఫైట్ చేసిన శివసేన పార్టీ అధికారం కోసం బీజేపీతో తెగతెంపులు చేసుకొని కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం. బీజేపీకి వ్యతిరేకంగా శివసేన బయటకురావడంతో మరోమాట మాట్లాడకుండా ఉద్ధవ్‌కు జైకొట్టింది కాంగ్రెస్. అయితే, గత కొన్ని రోజులుగా మహా అఘాడి వికాస్‌లో భాగస్వామ్యంగా ఉన్న ఎస్సీపీ…
దేశంలో డ్రగ్స్‌పై కఠినమైన నిబంధనలు వున్నా.. పోలీసులు అక్రమ డ్రగ్స్‌పై కొరఢా ఝులిపించినా.. ఇంకా అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో రూ. 879 కోట్ల విలువైన భారీ హెరాయిన్ ను అధికారులు పట్టుకున్నారు. ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా అవుతుండటంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. రాయ్ గఢ్ సమీపంలో ఈ హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రబ్ జోత్ సింగ్ అనే వ్యక్తి అరెస్ట్ చేశారు. ఇప్పటికే దేశంలో…
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా డెల్టాప్లప్ వేరియంట్ నుంచి ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంట్ ప్రధాన కారణం అయింది. ఈ వేరియంట్ కారణంగానే కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇకపోతే, ఇప్పుడు దేశాన్ని డెల్టాప్లస్ వేరియంట్ భయపెడుతున్నది. ఇప్పటికైతే ఈ వేరియంట్ కేసులు తక్కువగా నమోదైతున్నప్పటికీ, రాబోయో రోజుల్లో ఈ వేరియంట్ నుంచి థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read:…