ప్రముఖ నటుడు, హెల్పింగ్ స్టార్ సోనూసూద్‌కు మరో షాక్ తగిలింది. గెస్ట్ హౌస్ కోసం నిర్మించిన ఆరు అంతస్తుల భవనంలో సోనూసూద్ హోటల్ నడుపుతున్నారని… కోర్టు ఆదేశాల ప్రకారం సదరు హోటల్‌ను నివాస భవంతి మార్చుతానని మాట ఇచ్చిన ఆయన ఇంకా నిలబెట్టుకోలేదని ముంబై బృహన్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై సోనూసూద్ వెంటనే స్పందించాలని నోటీసుల్లో బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు గుర్తుచేశారు.
Read Also: హైదరాబాద్‌లో తాగుబోతుల వీరంగం.. ఒకేరోజు నలుగురు బలి
కాగా మహారాష్ట్రకు చెందిన హక్కుల కార్యకర్త గణేష్ అనే వ్యక్తి గతంలో సోనూసూద్‌పై బీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సోనూసూద్ రెసిడెన్షియల్ బిల్డింగ్‌ను హోటల్‌గా మార్చాడని… ఇది అక్రమం కనుక ఆ బిల్డింగ్‌ను కూల్చివేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ అంశంపై 2021 ఆరంభంలోనే బీఎంసీ అధికారులు, సోనూసూద్ మధ్య సంప్రదింపులు జరగ్గా… ఈ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఆ సమయంలో బీఎంసీ అధికారులు చెప్పినట్లు నడుచుకుంటానని తెలుపుతూ సోనూసూద్ లెటర్ ఇవ్వగా వివాదం సద్దుమణిగింది. అయితే ఇప్పటివరకు సోనూసూద్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదంటూ తాజాగా బీఎంసీ అధికారులు నోటీసులు పంపారు.