భారత స్వాతంత్య్ర ఉద్యమం ప్రజాస్వామ్య గళం.. దాని నుంచి ఉద్భవించిందే రాజ్యాంగం అన్నారు. ఇది కేవలం డాక్యుమెంట్ కాదు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మౌలానా ఆజాద్ లాంటి లాంటి వారు ఎంతో మంది ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేశారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
లోక్సభలో మాట్లాడిని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ బంగ్లాలోని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. వీటిని నివారించడానికి ఆ దేశ తాత్కాలిక సర్కార్ మైనారిటీలు, హిందువుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.
రాజ్యాంగంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్మ్యాప్గా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు.
Rahul Gandhi: శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తొలగించాలని ఈ రోజు ( డిసెంబర్ 11) లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కోరారు.
రాజ్యాంగంపై చర్చకు బీజేపీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. లోక్సభలో జరిగే ఈ చర్చలో ప్రధాని మోదీ కూడా పాల్గొని సమాధానం ఇవ్వనున్నారు. డిసెంబర్ 13-14 తేదీల్లో లోక్సభలో, డిసెంబర్ 16-17 తేదీల్లో రాజ్యసభలో ఈ చర్చ జరగనుంది. రాజ్యాంగం పట్ల తమకున్న నిబద్ధతను ప్రదర్శించి ప్రతిపక్షాలపై దాడి చేయడమే బీజేపీ లక్ష్యం
దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడింది. లోక్ సభ, రాజ్యసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతునే ఉంది. నాలుగోరోజైన ఈరోజు (నవంబర్ 29) కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక, లోక్సభ మధ్యాహ్నం వరకూ వాయిదా పడగా.. రాజ్యసభ ఏకంగా సోమవారాని(డిసెంబర్ 2)కి వాయిదా పడింది.
వాయనాడ్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికైన ప్రియాంక గాంధీ తొలిసారిగా పార్లమెంట్ హౌజ్లో అడుగుపెట్టారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక పార్లమెంట్ హౌస్కి చేరుకున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె పేరు పిలవగా.. నూతన ఎంపీ చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని.. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో వచ్చారు.
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ వయనాడ్ లోక్సభ బైపోల్లో ఘన విజయం సాధించారు. దాదాపు 4 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. సోదరుడు రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.