Lok Sabha: విప్ జారీ చేసినా డుమ్మా.. 20 మంది బీజేపీ ఎంపీలపై అధిష్టానం ఆగ్రహం
- ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లు కోసం విప్ జారీ చేసినా డుమ్మా
- 20 మంది బీజేపీ ఎంపీలపై అధిష్టానం ఆగ్రహం
- బీజేపీ ఎంపీలకు అధిష్టానం నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లును మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు కోసం బీజేపీ ఎంపీలకు సోమవారం హైకమాండ్ విప్ జారీ చేసింది. మంగళవారం ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని మూడు లైన్ల విప్ జారీ చేసింది. అయినా కొందరు ఎంపీలు లైట్ తీసుకున్నారు. దాదాపు 20 మంది బీజేపీ ఎంపీలు మంగళవారం సభకు డుమ్మాకొట్టారు. దీంతో బీజేపీ అధిష్టానం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. గైర్హాజరైన ఎంపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: AP High Court: హైకోర్టుకు కాకినాడ పోర్టు ఎంవీ స్టెల్లా నౌక వ్యవహారం
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
లోక్‌సభలో బిల్లు అనుమతికి బీజేపీ ఎంపీల గైర్హాజరు ఏ మాత్రం అడ్డంకి కాదు. కాకపోతే ప్రతిపక్షాలు విమర్శించేందుకు ఇదొక అస్త్రంగా అవకాశం ఇచ్చినట్లైందని బీజేపీ అధిష్టానం భావించింది. దీంతో గైర్హాజరైన 20 మంది ఎంపీలకు హైకమాండ్ నోటీసులు జారీ చేసింది.
రాజ్యాంగ (129వ సవరణ) బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నియమావళి ప్రకారం బిల్లులు సాధారణ మెజారిటీతో ఆమోదించబడ్డాయి. 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, 198 మంది వ్యతిరేకించారు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమని కాంగ్రెస్ సూచించింది.
దేశ వ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీని ద్వారా నిర్వహణ ఖర్చులు తగ్గించాలని భావిస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఒక వేళ బిల్లు ఆమోదం పొందితే.. దేశ వ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి.
ఇది కూడా చదవండి: Prabhas’ Fauji: ఫౌజి కోసం ఊహించని రిస్క్
తాజావార్తలు
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!