JPC Members: లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లుపై మంగళవారం ప్రవేశ పెట్టిన తీర్మానంపై ఓటింగ్‌లో ప్రభుత్వానికి సాధారణ మెజారిటీ వచ్చింది. జమిలి ఎన్నికల బిల్లులు అనేవి రాజ్యాంగ సవరణ బిల్లులు.. దానికి ఆమోదం పొందాలంటే తప్పకుండా 3/2 మెజారిటీ అవసరం. దీంతో సమగ్ర చర్చల కోసం ఈ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపుతామని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ఇక, జేపీసీ ఏర్పాటు ప్రక్రియను స్టార్ట్ చేస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ సభకు చెప్పుకొచ్చారు.
Read Also: GameChanger : గేమ్ ఛేంజర్ లో ఆ రెండు బ్లాక్ లు ఫ్యాన్స్ కు పూనకాలే
అయితే, జేపీసీ ఏర్పాటు ప్రక్రియ అనేది లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా పర్యవేక్షణలో జరగనుంది. అయితే, స్పీకర్ కు రాబోయే 48 గంటలు చాలా కీలకమైనవిగా చెప్పాలి.. ఎందుకంటే శుక్రవారం (డిసెంబర్ 20) సాయంత్రంలోగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. అప్పటి వరకు జేపీసీలోని సభ్యులు ఎవరెవరు అనేది ఓంబిర్లా ప్రకటించాల్సి ఉంది. లేదంటే, జమిలి ఎన్నికల బిల్లులపై మంగళవారం నాడు లోక్‌సభలో ఓటింగ్‌తో చేసిన తీర్మానం గడువు ముగుస్తుంది.
Read Also: Chiranjeevi : అనిల్ రావిపూడి, చిరంజీవి సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే..?
కాగా, జేపీసీ సభ్యులను స్పీకర్ ప్రకటించకపోతే.. మరోసారి జమిలి ఎన్నికల బిల్లులను ఫ్రెష్‌గా లోక్‌సభలో ప్రవేశ పెట్టాల్సి వస్తుంది అన్నమాట. అలా జరగొద్దంటే.. శుక్రవారం సాయంత్రంలోగా జేపీసీపై లోక్‌సభ స్పీకర్ ప్రకటన చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే, జేపీసీలో గరిష్ఠంగా 31 మంది సభ్యులు ఉండొచ్చు.. వీరిలో లోక్‌సభ నుంచి 21 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు ఉండనున్నారు. ఇక, జేపీసీ సభ్యత్వం కోసం ఎంపీల పేర్లు ఇవ్వాలని ఇప్పటికే లోక్‌సభ స్పీకర్ కార్యాలయం అన్ని ప్రధాన పార్టీలను కోరినట్లు సమాచారం. బిల్లుపై సమగ్ర చర్చలు జరిపేందుకు జేపీసీకి 90 రోజుల గడువు ఉంటది. అవసరాన్ని బట్టి ఈ గడువును అప్పుడప్పుడు పొడిగిస్తారు.