One Nation One Election Bill Live UPDATES: లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ (129) సవరణ బిల్లును ఈరోజు లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటికి పంపాలని స్పీకర్ ను మంత్రి కోరే అవకాశం ఉంది. పార్టీల బలాబలాలను బట్టి సభ్యులను ఈ సంఘంలో నియమించనున్నారు. లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లుపై లైవ్ అప్ డేట్స్ మీ కోసం..
అధ్యక్ష తరహా ఎన్నికలు తీసుకురావడంలో భాగమే ఈ జమిలి ఎన్నికల బిల్లు.. ఈ బిల్లు ప్రాంతీయ పార్టీలను తుడిచి పెట్టేస్తుంది: అసదుద్దీన్ ఒవైసీ..
జమిలి ఎన్నికల ఆమోదానికి అవసరమైన 2/3 మెజార్టీ లేనప్పుడు బిల్లును ఎలా పెడతారు: డీఎంకే
ఈ జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందితే.. ఈసీకి సర్వాధికారాలు వస్తాయి.. ఇక, ఈసీ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు.. తరుణ్ గొగొయ్..
జమిలి ఎన్నికల బిల్లుపై అభిప్రాయాలు వ్యక్తం చేసిన వివిధ పార్టీలు.. ఈ బిల్లులు ప్రవేశ పెట్టటం అంటేనే ప్రజాస్వామ్యంపై దాడి: ముస్లిం లీగ్ మహ్మద్ బషీర్
అసంబద్ధమైన ఈ బిల్లులను సభలో ఎలా అనుమతించారు: డీఎంకే టీఆర్ బాలు..
డా. బీఆర్ అంబేద్కర్ కంటే మేధావి, వివేకవంతులు.. ఈ సభలో లేరని చెప్పేందుకు ఏ మాత్రం సంకోచించను.. రాజ్యాంగ స్ఫూర్థిని కాలరాసేలా బీజేపీ ఉద్ధేశం కనిపిస్తుంది: ధర్మేంద్ర యాదవ్
రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసేలా బీజేపీ చర్యలు.. ఫెడరల్ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని, మేధోమధనం చేసి రాజ్యాంగాన్ని రూపొందించారు.. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది ఫెడరల్ వ్యవస్థను దెబ్బ తీయడమే- టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ
జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే.. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్..
2 బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ డిమాండ్.. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలు ఇవి.. ఇది ఎన్నికల సంస్కరణ కాదు.. ఒక నేత లక్ష్యాన్ని నెరవేర్చడమే: ఇండియా కూటమి
రాష్ట్రాల అసెంబ్లీల కాల వ్యవధిని కుదించడం రాజ్యాంగ విరుద్ధం: కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ
లోక్ సభలో వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకించిన సమాజ్ వాది పార్టీ..
జమిలి బిల్లు లోక్ సభలో గట్టెక్కాలంటే (542) 2/3 మెజార్టీ అవసరం.. ఎన్డీయే బలం- 293, ఇండియా కూటమి బలం-234, జమిలి బిల్లు పాస్ కావాలంటే 361 మంది సభ్యుల మద్దతు అవసరం..
జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్..
లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు.. బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ..
కాసేపట్లో లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు.. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్న న్యాయశాఖ మంత్రి.. వెంటనే సంయుక్త పార్లమెంటరీ స్థాయీ సంఘానికి బిల్లు.. తమ ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్.. బీజేపీకి దక్కనున్న స్థాయీ సంఘం ఛైర్మన్ పదవి.. సాయంత్రంలోపే జేపీసీ సభ్యుల ప్రకటన..
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తోందని విమర్శించిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు
జమిలి ఎన్నికలతో ఎలాంటి ఇబ్బందులు లేవని వైఎస్సార్‌సీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి తెలిపారు.. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచిదని టీడీపీ ఎంపీలు అంటున్నారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై తమిళనాడు సీఎం హాట్ కామెంట్స్.. రాష్ట్రపతి పాలనను తీసుకురావడమే బీజేపీ అంతిమ లక్ష్యం.. ఈ బిల్లులు ఆమోదం పొందితే, రాష్ట్రాలకు కాలానుగుణంగా ఎన్నికలు నిర్వహించే విధానాన్ని తొలగించబడుతుంది.. ఈ బిల్లు వల్ల ప్రాంతీయ భావాలు దెబ్బతింటాయి: సీఎం స్టాలిన్
వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది.. బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తోంది.. ఇది ఎన్నికల ప్రక్రియను తారుమారు చేసే అవకాశం ఉంది.. అధికారాన్ని కేంద్రీకరించాలని బీజేపీ చూస్తుంది.. జమిలి ఎన్నికలు ఎంత ఖర్చుతో కూడుకున్నది- ఎంపీ ప్రియాంక చతుర్వేది
వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లు రాజ్యాంగ విరుద్దం.. కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోంది- జైరాం రమేష్
జమిలి ఎన్నికల బిల్లు లోక్ సభ ముందుకు రానుంది.. ప్రజల ఆకాంక్షలను అమలు చేయడమే మోడీ సర్కార్ లక్ష్యం.. వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూస్తాం.. కచ్చితంగా ఈ బిల్లు పాస్ అవుతుంది.. దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయి- ఎంపీ రాఘునందన్ రావు
వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుకు వైసీపీ మద్దతు..
వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్.. లోక్ సభలో నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ..