One Nation One Election: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లు ఈరోజు (డిసెంబర్ 17) పార్లమెంటు ముందుకు రాబోతుంది. ఈ మేరకు ఇవాళ లోక్‌సభ ముందు ప్రవేశ పెట్టాల్సిన బిల్లుల జాబితాలో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును లిస్ట్ చేసింది. వన్ నేషన్- వన్ ఎలక్షన్ ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ నేటి మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తుంది.
Read Also: Delhi: దేశ రాజధానిలో కారు బీభత్సం.. వీడియో వైరల్
అయితే, జమిలి ఎన్నికల నిర్వహణపై అనేక అనుమానాలు కొనసాగుతన్నాయి. దీనిపై విస్తృతం సంప్రదింపుల కోసం బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించేలా స్పీకర్‌ను కోరే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తమ ఎంపీలంతా తప్పనిసరిగా ఇవాళ లోక్‌సభకు రావాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పటికే విప్ జారీ చేసింది. లోక్‌సభలో కీలక అంశాలపై చర్చ జరగనున్నందున డుమ్మా కొట్టొద్దంటూ మూడు లైన్ల విప్‌ను జారీ చేస్తూ లోక్‌సభలో బీజేపీ చీఫ్ విప్ డా. సంజయ్ జైస్వాల్ ఓ లేఖను రిలీజ్ చేసింది.