జీ-రామ్-జీ బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బిల్లుకు అధికార పార్టీ ఆమోదించింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చింది. కొత్త పేరు జీ-రామ్-జీ పేరుతో బిల్లు ఆమోదించింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. స్వచ్ఛమైన గాలి లేక నగర వాసులు అల్లాడిపోతున్నారు. ఇక పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. సరైన వాతావరణం లేక ఆస్పత్రి పాలవుతున్నాయి. ఇక ప్రజలైతే బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు.
SHANTI Bill: ‘‘అణు రంగం’’లోకి ప్రైవేట్ సంస్థల్ని అనుమతించడానికి కేంద్రం తీసుకువచ్చిన ‘‘శాంతి బిల్లు’’కు లోక్సభ ఈ రోజు(బుధవారం) ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ బిల్లు 2047 నాటికి 100 గిగా వాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ చేపట్టిన ‘ఓట్ చోరీ’ బహిరంగ సభలో కాంగ్రెస్ నేతలు మోడీ ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై ధ్వజమెత్తారు.
Shashi Tharoor: రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి శశి థరూర్ మరోసారి గైర్హాజరయ్యారు. ఆయన ఇలా చేయడం వరసగా ఇది మూడోసారి. పార్టీ కార్యకలాపాలు, సమావేశాలకు థరూర్ పదే పదే హాజరవ్వకపోవడం కాంగ్రెస్లో అసంతృప్తిని పెంచుతోంది.
లోక్సభలో ప్రస్తుతం ఈ-సిగరెట్ వివాదం నడుస్తోంది. గురువారం బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. పేరు ప్రస్తావించకుండా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఈ-సిగరెట్ తాగుతున్నారని.. దీనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాను అనురాగ్ ఠాకూర్ కోరారు.
ఎన్నికల సంస్కరణలపై బుధవారం పార్లమెంట్లో వాడివేడి చర్చ జరిగింది. ఎన్నికల సంఘంతో అధికార పార్టీ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతుందంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఎన్నికల సంస్కరణలపై బుధవారం పార్లమెంట్లో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు.
Rahul Gandhi: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వందేమాతరంపై చర్చ ప్రారంభించిన ఒక రోజు తర్వాత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.