2024 జూలై 29 వరకు దేశవ్యాప్తంగా 220 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ లోక్‌సభలో తెలిపారు. వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద భారతదేశం 3,012 లక్షల డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్లను 99 దేశాలకు, రెండు UN సంస్థలకు పంపిందని ఆయన చెప్పారు. అలాగే.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచిత సరఫరా కింద కోవిడ్ వ్యాక్సిన్ల కొనుగోలు కోసం సుమారు…
అగ్నిపథ్‌పై లోక్‌సభలో రాహుల్ గాంధీ వర్సెస్ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య వాడీవేడీ చర్చకు దారి తీసింది. అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్ష నేత తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజ్‌నాథ్ ఆరోపిస్తూ.. ఈ అంశంపై సభలో చర్చిస్తామన్నారు.
దేశ వ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు.
పార్లమెంట్లో సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఇక ఇండియా కూటమి నేతలు ఆరోపణలు గుప్పించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఖర్గే ఇంట్లో ఈ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంగళవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలంతా చర్చిస్తున్నారు.
మరికొన్ని గంటల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక సామవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌కు లోక్‌సభ స్పీకర్ శుభవార్త చెప్పారు. జూలై 5న (శుక్రవారం) ఎంపీగా అమృతపాల్ ప్రమాణస్వీకారం చేసేందుకు అనుమతి ఇచ్చారు.