పార్లమెంట్లో సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఇక ఇండియా కూటమి నేతలు ఆరోపణలు గుప్పించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఖర్గే ఇంట్లో ఈ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంగళవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలంతా చర్చిస్తున్నారు.
మరికొన్ని గంటల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక సామవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌కు లోక్‌సభ స్పీకర్ శుభవార్త చెప్పారు. జూలై 5న (శుక్రవారం) ఎంపీగా అమృతపాల్ ప్రమాణస్వీకారం చేసేందుకు అనుమతి ఇచ్చారు.
PM Modi: లోక్‌సభలో పవర్ఫుల్ స్పీచ్‌తో ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు.2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ముందున్న అతిపెద్ద సవాల్ కాంగ్రెస్‌తో పాటు దాని ఎకోసిస్టమ్ అని అన్నారు.
NEET issue: నీట్ సమస్య, పేపర్ లీకులపై ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో స్పందించారు. దేశంలో ఇలాంటి ఘటనలు నివారించేందుకు ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ప్రతీ విద్యార్థికి, దేశంలో ప్రతీ యువకుడికి చెబుతున్నానని భరోసా ఇచ్చారు.
PM MODI: రాహుల్ గాంధీ హిందువులపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు లోక్‌సభలో విరుచుకుపడ్డారు.హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని దేశాన్ని ఎప్పుడూ మరిచిపోదని అన్నారు.
Rahul Gandhi : లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం నాడు దిగువ సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై స్పందిస్తూ, “ప్రధాని మోడీ ప్రపంచంలో ప్రతిదీ తొలగించబడింది” అని మంగళవారం అన్నారు. “మోడీ జీ ప్రపంచంలో, సత్యాన్ని నిర్మూలించవచ్చు. కానీ వాస్తవానికి, సత్యాన్ని తొలగించలేము. నేను చెప్పవలసింది నేను చెప్పాను, అదే నిజం. వారు కోరుకున్నంత వెలికితీయగలరు. సత్యమే సత్యం” అని ఆయన పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులతో అన్నారు. తరువాత, కాంగ్రెస్ నాయకుడు లోక్‌సభ…
Akhilesh Yadav : లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్ పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేపర్ లీక్ విషయంలో అఖిలేష్ మాట్లాడుతూ.. ఎవరికీ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేపర్ లీక్ చేస్తుందన్నారు. అలాగే, ఈవీఎంల విషయంలో మేం ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని, దానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని అఖిలేష్ అన్నారు. అగ్నివీర్ పథకం రద్దుపై అఖిలేష్ మరోసారి మాట్లాడారు. మంగళవారం…