ధాన్యం కొనుగోళ్లు ఈ నెలఖారులోగా పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. బుధవారం నిర్మల్ జిల్లాలోని అంబేద్కర్ భవన్‌లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల్లో 185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా జిల్లాలో మొత్తం 43 రైస్ మిల్లులు ఉండగా.. అందులో 10 బాయిల్డ్.. 33 రా…
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. పవన్ కల్యాణ్ ఈ నెల 14న ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్.. ఇటీవల మరణించిన జనసేన క్రీయాశీలక కార్యకర్తల కుటుంబాలను పరామర్శించున్నారు. అయితే ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాకకు తెలంగాణ జనసేన శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. పవన్ కల్యాణ్ పర్యటనలో సీఎం కేసీఆర్‌పై ఏమైనా విమర్శలు చేస్తారా అని రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా గత కొన్ని…
హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ మరో 3 నెలల్లో అందుబాటులోకి రానున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు 95శాతం పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ మహేందర్‌రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భవనంలోని అన్ని టవర్లను, డేటా…
కేంద్రంలో మధర్ థెరిస్సా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు ఎస్ మండలంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన రైతు ఉత్పత్తిదారుల సంఘం నూతన భవనాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సమృష్టి వ్యవసాయ అభివృద్ధిపై రైతాంగం దృష్టి సారించాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం వ్యవసాయానికి అవసరమైన నీరు, విద్యుత్‌ను సమృద్ధిగా అందుబాటులో ఉంచిందన్నారు. రైతాంగం అధిక…
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ముక్కుపచ్చలారని చిన్నారులు మృత్యుఒడిలోకి వెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్‌నూమాలోని ఓ ప్రైవేటు పిల్లల ఆసుపత్రిలో.. ఇద్దరు చిన్నారులను ఆసుపత్రి సిబ్బంది ఇంక్యుబేటర్‌లో ఉంచారు. అయిత.. నిర్దేశిత సమయం వరకే చిన్నారులను ఇంక్యుబేటర్‌లో పెట్టాల్సిన ఉండగా.. సిబ్బంది మాత్రం చిన్నారులను ఇంక్యుబేటర్‌లో పెట్టి అలాగే వదిలేశారు. దీంతో ఇంక్యుబేటర్‌లో వేడి తట్టుకోలేక ఆ ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. దీంతో…
సింగరేణి కార్మిక చైతన్య యాత్ర ముగింపు సభలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిర్వహించిన సభలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన కూడా సింగరేణిని ఇంకా దారిద్య్ర పరిస్థితికి కారణం కేసీఆర్ అనే ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం నన్ను టీఆర్‌ఎస్ పార్టీ నుండి మెడలు పట్టి బయటికి పంపించిందని, అయినా నాకు ఇంకో సారి తెలంగాణ కొరకు యుద్ధం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఈటల…
నేటి సమాజంలో రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగినా, ఎలాంటి సంఘటన జరిగినా మనకేందుకులే అనుకుంటారు. కానీ.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే రేఖా నాయక్ రోడ్డు ప్రమాద బాధితుల పట్ల మానవత్వాన్ని ప్రదర్శించారు. కడెం పర్యటన ముగించుకుని ఎమ్మెల్యే రేఖా నాయక్ నిర్మల్ వెళ్తుండగా, ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామ శివార్లలో ఓ కారు చెట్టుకు ఢీకొని ప్రమాదానికి గురైంది. ఇది గమనించిన ఎమ్మెల్యే రేఖా నాయక్ వెంటనే తన…
ఓ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. ఓ స్కూల్‌లో బాలికలకు 5000 మీటర్ల వాకింగ్ రేస్ పోటీ జరుగుతోంది. అయితే వాకింగ్ మధ్యలో తాగేందుకు మంచినీళ్లను గ్లాస్‌లలో ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడే స్పోర్ట్స్ ఫెడరేషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విద్యార్థుల తాగే మంచినీళ్ల బాటిల్స్ పక్కనే శానిటైజర్ బాటిళ్లు కూడా ఉండడంతో.. పొరపాటు స్పోర్ట్స్ ఫెడరేషన్ సిబ్బంది శానిటైజర్‌ను వాటర్ గ్లాసుల్లో నింపారు. దీంతో శానిటైజర్ అని తెలియక తాగిన విద్యార్థులు…
బెర్త్ ఉన్న రైలు ప్రయాణం ఎంత బాగుంటుందో… బెర్త్ లేకుండా చేసే ప్రయాణం అంతే ఇబ్బందిగా ఉంటుంది. అయితే రైలులో బెర్త్ దొరికినా.. బాలింతలు చట్టిబిడ్డలతో అవస్థలు పడుతుంటారు. అంతేకాకుండా చిన్నపిల్లలు ఉన్న తల్లులు ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నపిల్లల కోసం రైల్వే శాఖ సీటును ప్రత్యేకంగా రూపొందించింది. ప్రయాణ సమయంలో తల్లులు పడుతున్న ఇబ్బందులను రైల్వే శాఖ దృష్టిలో పెట్టుకొని రైలులో ప్రత్యేక…
మనలో కళ ఉండాలే కానీ, కళకళలాడే ఓ రోజు వస్తుంది. ఈ సత్యాన్ని నమ్ముకొని నవతరం నాయిక సాయిపల్లవి చిత్రసీమలో అడుగు పెట్టింది. ఆమెకు ఉన్న కళ ఏమిటంటే – నాట్యం! సంగీత దర్శకుల బాణీలకు అనువుగా తన కాళ్ళతోనూ, చేతులతోనూ నర్తనం చేసి ఆకట్టుకోగల నైపుణ్యం సాయి పల్లవి సొంతం. నృత్యంలో అనుభవం ఉన్న కారణంగా ముఖంలో భావాలను ఇట్టే పలికించగలదు. అందువల్లే సాయిపల్లవి తన పాత్రల్లోకి అతి సులువుగా ఒదిగిపోతూ కనిపిస్తుంది. సాయిపల్లవి 1992…