హైదరాబాద్ లో వరుసగా డ్రగ్స్ అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. వారం రోజుల వ్యవధిలో మూడు అతిపెద్ద కన్సైన్మెంట్ అని అధికారులు పట్టుకున్నారు. తాజాగా 54 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ హైదరాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు సీజ్ చేశారు. ఐదుగురు మహిళల వద్ద నుంచి ఈ డ్రగ్స్ స్వాధీనపర్చుకున్నారు. ఐదుగురు మహిళలు తమ హ్యాండ్ బ్యాగ్ ఏర్పాటు చేసిన సోరగులో డ్రగ్స్ పెట్టుకొని వచ్చారు. ఇవాళ ఉదయం 5 గంటల ప్రాంతంలో దోహా నుంచి…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నిన్న, నేడు తెలంగాణలో పర్యటించిన విషయం విధితమే. అయితే.. నిన్న వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ‘రైతు సంఘర్షణ’ సభలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీ, ఓవైసీలకు ఛాలెంజ్ విసరడానికే తాను రాష్ట్రానికి వచ్చినట్లు ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ స్పందిస్తూ.. తెలంగాణాకు ఎవరైనా రావొచ్చన్న అసద్.. రాహుల్‌కు తెలంగాణ గురించి ఏమీ తెలియదన్నారు. అంతేకాకుండా.. ఏం మాట్లాడాలో అని అడిగిన రాహుల్…
సరూర్ నగర్‌లో ఇటీవల జరిగిన హత్య గురించి.. ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజును హత్య చేయడంపై ఖండిస్తున్నట్లు ఒక మీటింగ్ లో అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అయితే దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. ముస్లిం అమ్మాయి.. హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో నుంచి బహిష్కరిస్తే బాగుండేది.. కానీ అలా మర్డర్ చేయడం బాగోలేదని ఓవైసీ అన్నాడని, కానీ ఇదంతా షోకుటాప్ ముచ్చట్లే అంటూ మండిపడ్డారు. అసద్ మనసులో ఉంది ఒకటి… నోటి…
తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ టీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏ పదవిలో తెలంగాణకు వచ్చారో నాకు తెలియదన్నారు. తెలంగాణలో రిమోట్ జరగడం లేదని.. మీ కాంగ్రెస్‌ది రిమోట్ పాలన అని కేటీఆర్ మండిపడ్డారు. మీరు చెప్పినవన్నీ నమ్మేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా లేరని, ఇక్కడి…
Telangana IT and Industries Minister KTR laid the foundation for the Kitex unit at the Kakatiya Mega Textile Park Warangal, on Saturday. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు వరంగల్‌ను కాకతీయ మెగా పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా కంపెనీలు ప్రారంభించడానికి కొంత ఆలస్యం జరిగిందని, రాబోయే 18 నెలల్లో 20…
‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సౌత్ నార్త్ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలో వసూళ్ళ వర్షాన్ని కురిపిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం 1100కోట్ల మార్క్‌ను అధిగమించి రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ చిత్రం అన్ని భాషల్లో బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్లలో ఖాన్, కపూర్‌లను సైతం వెనక్కి నెట్టి రాఖీ బాయ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు.…
రోజురోజుకు డ్రగ్స్ వాడకం ఎక్కువవుతోంది. ఒత్తిడి లోనైన యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. అయితే డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వారికి కొత్త కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు హైదరాబాద్ కమిషనర్.. సీవీ ఆనంద్ వెల్లడించారు. డ్రగ్స్ వినియోగదారులకి ఉత్సవాల కౌన్సిలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి బయటికి వచ్చి మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటున్న నేపథ్యంలో కొత్త నిర్ణయం తీసుకున్నామన్నారు. వినియోగదారులపై నిరంతరం నిఘా పెట్టబోతున్నట్లు సీటీ పోలీస్ బాస్ పేర్కొన్నారు. వారానికి ఒకసారి వినియోగదారుల రక్త,…
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేడు వరుస ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో రు. 2.15 కోట్ల విలువ చేసే సిటీ స్కాన్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు.. అనంతరం కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత సిటీ స్కాన్ ప్రారంభించారు. దీంతో పాటు సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో సర్జికల్ ఎక్విప్మెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటి…
బహుదూర్‌పుర లో డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. 225 గ్రాముల బ్రౌన్ షుగర్, 28 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. నలుగురుని అరెస్ట్ చేశామని, ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు షాహ్జదా సయ్యద్ గతంలో ముంబై డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడని, ఈ కేసులో వైజాగ్ నుంచి గంజాయి హైదరాబాద్…
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో ప్రొఫెసర్ కోదండరాం కృష్ణ జలాల పరిరక్షణ యాత్రలో భాగంగా వాసవి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు కృష్ణ బోర్డ్ సమావేశం కాబోతుంది. ఈ సమావేశ్మలో శ్రీశైలం, నాగార్జునసాగర్ లో ఉన్న 15 ఔట్ లెట్స్ కావాలని అడుగుతున్నారన్నారు. ఆర్డీఎస్ 15.9టీఎంసీల రావాలి కానీ సగం కూడా రావడం లేదు. ఈ అంశంపై ఇప్పటికీ కూడా మనకు న్యాయం చెయ్యలేక పోయింది. తప్పని…