ఖమ్మం జిల్లా వేంసూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ధాన్యం తడవకుండా పట్టాను కప్పుతున్న సమయంలో పిడుగు పాటుకు గురై 24 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తూ ఉండటంతో ఆరపోసిన ధాన్యం తడిసిపోతోందని ఆవేదన చెందిన యువ రైతు సాగర్.. ఆ ధాన్యం రాశి వద్దకు వెళ్లి పట్టాను కప్పు తున్న సమయంలో పిడుగు పడటం తో అక్కడికక్కడే మృతి చెందాడు. సాగర్ వేంసూర్ వెటర్నరీ హాస్పటల్…
ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6,832 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన ధాన్యం దిగుబడికి అనుగుణంగా ఇప్పటి వరకు 30 జిల్లాల్లో 5299 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం నాటికి 76,495 మంది రైతులనుంచి రూ. 1483 కోట్ల విలువ చేసే 7.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు ఆయన వెల్లడించారు.…
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి గేట్ వద్ద టాటా ఏస్, లారీ ఢీ కొన్నాయి. దీంతో.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందగా, ఎల్లారెడ్డి లో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనలో మొత్తం ఆరుగురు మృత్యువాత పడ్డారు. అయితే.. మృతులు పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.…
గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (VTG SET-2022 ) ప్రశాంతంగా ముగిసింది. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 2022 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు లక్షా 34వేల 478 మంది బాలబాలికలు హాజరయ్యారు. గత విద్యా సంవత్సరంలో 74వేల 52మంది మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. 90.91% విద్యార్థుల హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 48 వేల120 మంది విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి.…
ఇటీవల సరూర్ నగర్‌లో జరిగిన పరువు హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు వెలుగులో వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నాగరాజును పథకం ప్రకారమే హత్య పోలీసులు వెల్లడించారు. నాగరాజు మొబైల్‌లో స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసిన నిందితులు.. నాగరాజు హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రతి కదలికను మొబైల్ ద్వారా ట్రాక్ చేసినట్లు తెలిపారు. నిందితులు రంజాన్ ఉపవాస దీక్షలో ఉండటంతో హత్య వాయిదా వేసినట్లు.. దీక్ష ముగియగానే పక్కా ప్లాన్‌తో నాగరాజు హత్య చేసినట్లు పోలీసుల పేర్కొన్నారు.…
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ సభ కోసం కాంగ్రెస్ పార్టీ 87కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టారని, ఎప్పుడైనా 70సంవత్సారలలో రైతులకు గిట్టబాటు ధర ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, రాహుల్ గాంధీ వాగ్ధానాలు అన్ని వింటే నవ్విస్తుందన్నారు. ఇది కేవలం తెలంగాణ ప్రజలని మోసం చేయడం కోసమేనని, ఎందుకు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు…
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య వార్ నడుస్తూనే ఉంది. 73 రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం కాగా.. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అయితే.. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్ సహా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు అందజేస్తోన్న ఆయుధ సామాగ్రితో రష్యా ధాటిని ఉక్రెయిన్ సైన్యం అడ్డుకుంటోంది. ఈ క్రమంలో రెండు వైపులా పెద్ద…
సోమవారం రష్యాలో “విజయ దినం కవాతు” జరగనుంది. “విక్టరీ డే పరేడ్”గా ప్రసిద్ధి గాంచిన ఈ మెగా ఈవెంట్ కు పుతిన్ సర్కార్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. వేలాదిగా సైనికులు, వందల సంఖ్యలో యుద్ధ ట్యాంకులు, భారీ సైనిక వాహనాలు రాజధాని మాస్కో నడిబొడ్డున రెడ్ స్క్వేర్ గుండా ప్రదర్శనగా సాగిపోనున్నాయి. ఆకాశంలో ఫైటర్ జెట్లు గర్జిస్తుండగా రష్యా తన సైనిక పాటవాన్ని ప్రపంచానికి ప్రదర్శించనుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి…
పుడ్డింగ్ అండ్ మింకి పబ్ వ్యవహారంలో పోలీసుల విచారణ వేగంగా కొనసాగుతుంది. పబ్ లోపలికి డ్రగ్స్ ఎలా వచ్చాయని దానిపైన పోలీసుల విచారణ దాదాపుగా పూర్తి చేశారని చెప్పవచ్చు. అయితే పబ్ లోపలికి డ్రగ్స్ తీసుకు వచ్చిన వారిని పోలీసులు గుర్తించారు .. పబ్ పై దాడి చేసి 148 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు వ్యక్తులు పబ్ లోకి డ్రగ్స్ తీసుకొని వచ్చినట్టుగా తేలింది. అయితే పబ్ యజమానికి వ్యవహారం మొత్తం తెలిసే డ్రగ్స్…
గంజాయి స్మగ్లర్లు కొత్తకొత్త రూట్లలో ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారు. కొత్త తరహాలో కొత్త రూట్ లో పుష్పకు మించిన తెలివితేటలతో గంజాయిని సిటీలకు చేరవేస్తున్నారు…గంజాయి స్మగ్లర్లు తెలివితేటలు చూసి పోలీసులు అవాక్కవుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో 70 కిలోల గంజాయిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి నేరుగా హైదరాబాద్ గల్లిలోకి చేరవేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి రోడ్డు మార్గం ద్వారా స్మగ్లింగ్ జరుగుతోందని పోలీసులు భావించారు.…