జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. పవన్ కల్యాణ్ ఈ నెల 14న ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్.. ఇటీవల మరణించిన జనసేన క్రీయాశీలక కార్యకర్తల కుటుంబాలను పరామర్శించున్నారు. అయితే ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాకకు తెలంగాణ జనసేన శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. పవన్ కల్యాణ్ పర్యటనలో సీఎం కేసీఆర్‌పై ఏమైనా విమర్శలు చేస్తారా అని రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో రాజకీయ నాయకుల పర్యటనలు పెరుగుతున్నాయి.
మొన్నటికి మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మహబూబ్‌నగర్‌లో పర్యటించగా.. ఇటీవల ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వరంగల్ జిల్లాలో పర్యటించారు. అంతేకాకుండా ఈ నెల 14న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో భారీ బహిరంగ సభను మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో నిర్వహించనున్నారు. అయితే ఈ భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు.