Delhi Meeting: ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం.. “ప్రజల తెలంగాణ” లక్ష్యం దిశగా చర్చలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Meeting: ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించిన కీలక సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, దామోదర రాజనర్సింహా, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్, పార్టీ ప్రస్తుత పరిస్థితులు, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది.
Abhishek Sharma Form: 0, 0, 0.. అభిషేక్ షర్మ ఫామ్‌పై సూర్య ఏమన్నాడంటే?
Also Read
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
- TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభినందించారు. ముఖ్యంగా తెలంగాణ మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘనవిజయం నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. సమానత్వంతో కూడిన తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, “ప్రజల తెలంగాణ” లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణను రూపొందించినట్లు పేర్కొన్నారు. సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, ప్రతి పౌరుడికి న్యాయం అందించడం తమ ప్రధాన సంకల్పమని ఆయన వెల్లడించారు.

Dolby Atmos ఆడియో, 4K QLED విజువల్ ఉన్న Vu Vibe Series mart Google TVపై రూ.39000 భారీ డిస్కౌంట్!
ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మల్లికార్జున ఖర్గే తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిందని, రాష్ట్ర నాయకులు, మంత్రులతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా తదుపరి కార్యాచరణపై చర్చించామని, సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, అందరికీ న్యాయం అనే లక్ష్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడి ఆకాంక్షలను సాకారం చేస్తూ సమగ్ర తెలంగాణ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
My gratitude to the committed grassroots workers of @INCTelangana for their commendable victory in the Telangana local body elections. This mandate reflects the trust of the people.
The Congress government remains resolute to our solemn affirmation of a "Prajala Telangana" – a…
— Mallikarjun Kharge (@kharge) February 13, 2026
తాజావార్తలు
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
-
Telangana DEO : తెలంగాణలో 4 జిల్లాలకు కొత్త డీఈఓలు.. ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగింత
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!