Vanastalipuram M*urder: రెండు నెలల రెక్కీ.. వనస్థలిపురం హత్య కేసులో సంచలన విషయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vanastalipuram Murder: హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం వివేకానంద నగర్ లో చోటుచేసుకున్న మహిళ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రకు చెందిన సునితను ఆమె మొదటి భర్త దేవరకొండ మహేశ్ దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లా మంథని గ్రామానికి చెందిన మహేశ్, గతంలో సునితను వివాహం చేసుకుని ఆమెను కెనడాకు తీసుకెళ్లాడు.
Abhishek Sharma Form: 0, 0, 0.. అభిషేక్ షర్మ ఫామ్‌పై సూర్య ఏమన్నాడంటే?
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
అయితే అక్కడ భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తడంతో మహేశ్ తిరిగి భారత్ కు వచ్చాడు. అనంతరం సునిత అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహేశ్ పై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో మహేశ్ కెనడాకు తిరిగి వెళ్లలేక భారత్‌లోనే ఉండిపోయాడు. చివరకు 2024లో మహేశ్, సునిత విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. సునిత తరువాత త్రినాథ్ అనే యువకుడిని ప్రేమించి రెండో వివాహం చేసుకుని వనస్థలిపురం ప్రాంతంలో నివసిస్తోంది.
దీంతో మహేశ్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తన కెరీర్‌ను నాశనం చేసిందని భావించిన మహేశ్, సునితను ఎలాగైనా హత్య చేయాలని పథకం రచించాడు. ఇందుకోసం ఆమె ఆచూకీ కోసం రెండు నెలల పాటు వెతికిన మహేశ్.. తుర్కాయాంజాల్‌లోని అరుణ్ పీజీ హాస్టల్‌లో ఉంటూ సునిత నివాసాన్ని గుర్తించాడు. వనస్థలిపురంలోని కప్పుల చెరువు సమీపంలో ఆమె ఉంటున్నట్లు తెలుసుకున్న అనంతరం.. మూడు రోజుల పాటు ఆమె ఇంటి వద్ద రెక్కీ నిర్వహించాడు.
Dolby Atmos ఆడియో, 4K QLED విజువల్ ఉన్న Vu Vibe Series mart Google TVపై రూ.39000 భారీ డిస్కౌంట్!
హత్యను అమలు చేయడానికి మహేశ్ ముందుగానే ప్రణాళిక రూపొందించాడు. ఇందుకోసం ఆన్‌లైన్ ద్వారా కొబ్బరి బోండాలు కోయడానికి ఉపయోగించే కత్తి, చెట్ల కొమ్మలు కట్ చేసే కట్టర్, ఆటోమేటిక్ చైన్ రంపం వంటి ప్రమాదకర పరికరాలను కొనుగోలు చేశాడు. ఈ టూల్స్‌ను రెండు బ్యాగుల్లో హాస్టల్‌కు తీసుకువచ్చి, హత్యకు ముందురోజు రాత్రే సిద్ధంగా ఉంచుకున్నాడు. అనంతరం బుధవారం ఉదయం హాస్టల్ నుంచి బ్యాగులతో బయటకు వచ్చిన మహేశ్, ముందుగానే అద్దెకు తీసుకున్న సెల్ఫ్ డ్రైవ్ కారులో సునిత ఇంటి వద్దకు చేరుకున్నాడు. అపార్ట్‌మెంట్ వద్ద కారును ఆపి టూల్స్ ఉన్న బ్యాగులను పైకి తీసుకెళ్లి, అందులోని కత్తితో సునితపై దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!