హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ముక్కుపచ్చలారని చిన్నారులు మృత్యుఒడిలోకి వెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్‌నూమాలోని ఓ ప్రైవేటు పిల్లల ఆసుపత్రిలో.. ఇద్దరు చిన్నారులను ఆసుపత్రి సిబ్బంది ఇంక్యుబేటర్‌లో ఉంచారు. అయిత.. నిర్దేశిత సమయం వరకే చిన్నారులను ఇంక్యుబేటర్‌లో పెట్టాల్సిన ఉండగా.. సిబ్బంది మాత్రం చిన్నారులను ఇంక్యుబేటర్‌లో పెట్టి అలాగే వదిలేశారు.
దీంతో ఇంక్యుబేటర్‌లో వేడి తట్టుకోలేక ఆ ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. దీంతో శిశువుల కుటుంబాలు హాస్పిటల్ యాజమాన్యం, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. తల్లిదండ్రులు తమ పిల్లలను చేతుల్లో తీసుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. పిల్లల ముక్కు, బుగ్గలు, పొట్ట భాగాల్లో వేడిమి తాలుకూ గుర్తులను మీడియాకు చూపిస్తూ.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.