ఓ స్పోర్ట్స్ ఫెడరేషన్ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. ఓ స్కూల్‌లో బాలికలకు 5000 మీటర్ల వాకింగ్ రేస్ పోటీ జరుగుతోంది. అయితే వాకింగ్ మధ్యలో తాగేందుకు మంచినీళ్లను గ్లాస్‌లలో ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడే స్పోర్ట్స్ ఫెడరేషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విద్యార్థుల తాగే మంచినీళ్ల బాటిల్స్ పక్కనే శానిటైజర్ బాటిళ్లు కూడా ఉండడంతో.. పొరపాటు స్పోర్ట్స్ ఫెడరేషన్ సిబ్బంది శానిటైజర్‌ను వాటర్ గ్లాసుల్లో నింపారు. దీంతో శానిటైజర్ అని తెలియక తాగిన విద్యార్థులు అస్వస్థతలకు లోనైయ్యారు. అంతేకాకుండా శానిటైజర్ తాగిన తర్వాత ఓ అథ్లెట్ కుప్పకూలాడు.
కొందరు విద్యార్థులకు వాంతులు కావడంతో స్పోర్ట్స్ ఫెడరేషన్ అధికారులు విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జపాన్‌లో చోటు చేసుకుంది. అయితే… తాగునీటి బాటిల్స్ పక్కనే ప్లాస్టిక్ బాటిల్‌లో శానిటైజర్ ఉండటంతో పొరపాటున గ్లాసుల్లో శానిటైజర్‌ను నింపారని స్పోర్ట్స్ ఫెడరేషన్ పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని యమనషి గవర్నర్ కొటరొ నగషకి పేర్కొన్నారు. బాధిత అథ్లెట్లు వారి కుటుంబాలకు తాను క్షమాపణలు చెబుతున్నానన్నారు.