Sai Pallavi Birthday Special: నర్తనమే సాయి పల్లవికి కవచం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనలో కళ ఉండాలే కానీ, కళకళలాడే ఓ రోజు వస్తుంది. ఈ సత్యాన్ని నమ్ముకొని నవతరం నాయిక సాయిపల్లవి చిత్రసీమలో అడుగు పెట్టింది. ఆమెకు ఉన్న కళ ఏమిటంటే – నాట్యం! సంగీత దర్శకుల బాణీలకు అనువుగా తన కాళ్ళతోనూ, చేతులతోనూ నర్తనం చేసి ఆకట్టుకోగల నైపుణ్యం సాయి పల్లవి సొంతం. నృత్యంలో అనుభవం ఉన్న కారణంగా ముఖంలో భావాలను ఇట్టే పలికించగలదు. అందువల్లే సాయిపల్లవి తన పాత్రల్లోకి అతి సులువుగా ఒదిగిపోతూ కనిపిస్తుంది.
సాయిపల్లవి 1992 మే 9న తమిళనాడు నీలగిరి జిల్లాలోని కోటగిరిలో జన్మిచింది. కొయంబత్తూర్ లోని అవిలా కాన్వెంట్ స్కూల్ లో సాయి పల్లవి విద్యాభ్యాసం సాగింది. సాయి పల్లవి ఎక్కడా నాట్యశిక్షణ తీసుకున్నది లేదు. చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ఎంతో ఇష్టం. తన చెవులకు సోకిన సంగీతానికి అనువుగా ఆమె అడుగులు కలిపేది. అదే చూపరులను ఎంతగానో ఆకట్టుకొనేది. ఆ పై సినిమా పాటలను చూస్తూ, వాటిలోని డాన్స్ ను అనుకరించింది. తరువాత అవే బాణీలకు తాను సొంతగా ఎలా డాన్స్ చేస్తానో చూపించేది. ఇలా ప్రాక్టీస్ చేస్తూనే ఓ వైపు తన చదువునూ కొనసాగించింది. జార్జియాలోని టిబిలిసి మెడికల్ యూనివర్సిటీలో డాక్టర్ కోర్సు చదివింది. ఈ యూనివర్సిటీకి మన దేశంలోని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది. 2016లోనే ఆమె డాక్టర్ పట్టా పొందాలి. అయితే డాన్స్, సినిమా కెరీర్ కారణంగా సరైన సమయంలో డాక్టర్ అనిపించుకోలేక పోయింది. అయితే 2020 ఆగస్టు 31న ట్రిచీలో ‘ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్’ రాసింది.
Also Read
- Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
2009లో ఈటీవీ నిర్వహించిన ‘ఢీ’ కార్యక్రమంలో తన డాన్సుల ద్వారా ఫైనలిస్ట్ గానూ నిలిచింది సాయిపల్లవి. ఇక నటన విషయానికి వస్తే, చిన్నతనం నుంచీ ఎంతో చురుగ్గా ఉన్న సాయిపల్లవిని 2005లో మళయాళం దర్శకుడు ఎ.కె.లోహిత్ దాస్ తాను దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కస్తూరి మాన్’లో నటింప చేశారు. 2008లో జయం రవి హీరోగా రూపొందిన ‘ధామ్ ధూమ్’లోనూ నటించింది సాయిపల్లవి. 2014లో మళయాళ చిత్రం ‘ప్రేమమ్’లో నాయికగా నటించి మురిపించిందామె. ఆ తరువాత నుంచీ చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తూ ముందుకు సాగింది. 2017లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టింది సాయిపల్లవి. ఆ సినిమాలో భానుమతి పాత్రలో భలేగా అలరించిందామె. అప్పటి నుంచీ సాయి పల్లవి తెలుగు చిత్రాల్లోనూ తన ప్రతిభను చాటుకుంది.
నాని హీరోగా రూపొందిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రంలో సాయి పల్లవి డాన్స్ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ పై “కణం, పడి పడి లేచె మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్” చిత్రాల్లోనూ సాయిపల్లవి తనదైన అభినయంతో ఆకట్టుకుంది. ఓ వైపు తమిళ, మళయాళ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు తనకు ఎంతో పేరు సంపాదించి పెట్టిన తెలుగు చిత్రసీమలోనూ సాయిపల్లవి సక్సెస్ రూటులో సాగిపోతోంది. ఆమె నటించిన అనువాద చిత్రాలు సైతం తెలుగువారిని అలరిస్తున్నాయి. రానాతో కలసి సాయిపల్లవి నటించిన ‘విరాటపర్వం’ చిత్రం జూలై 1న జనం ముందుకు రానుంది. ఇందులో ఆమె వెన్నెల అనే పాత్ర పోషించింది. మరి ఈ చిత్రంతో సాయి పల్లవి ఏ తీరున ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
-
Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!