సివిల్స్ 2021లో ర్యాంకులు సాధించిన వారందరికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇవాళ తన ట్విట్టర్లో ఆయన స్పందిస్తూ.. సివిల్స్ ఫలితాలతో సంక్పలం, పట్టుదలకు చెందిన కొన్ని అద్భుతమైన కథలు వెలుగులోకి వచ్చినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. సివిల్స్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచిన టాప్ ముగ్గురు అమ్మాయిలకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్‌కు ఎంపికైన ర్యాంకర్లను కూడా మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. మీ ప్రతిభ, ప్రయత్నాలతో ఈ దేశాన్ని…
దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కే తారకరామారావుకు వచ్చిన ఆదరణను చూసి బీజేపీ నేతలకు భయం పట్టుకొన్నదని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. అక్కడికి అన్ని రాష్ట్రాల మంత్రులు వెళ్లినా కేటీఆర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారని, రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారని తెలిపారు. తెలంగాణ పథకాలనే కేంద్రం కాపీ కొట్టి అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. మోదీ రోజుకు పది డ్రెస్సులు మార్చుడు తప్ప.. ఎనిమిదేండ్లలో దేశానికి ఏమైనా మంచి చేశారా? అని…
తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తాం, దేశంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీజేపీయే అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈనెల 31న 11 వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల ఖాతాలో జమ ఈ సందర్భంగా మోడీ ప్రసంగించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాను.. ఇది పార్టీ ప్రోగ్రాం కాదని గుర్తుంచుకోవాలి. కేంద్రంలో లో కాంగ్రెసేతర ప్రభుత్వం…
మంత్రి కేటీఆర్ మరో ఘనత సాధించారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (Badminton Association) అధ్యక్షుడిగా రెండోసారి కేటీఆర్ ఎన్నికయ్యారు. క్రీడల్లో రాజకీయ నాయకులకు తావు లేదని గతంలో ప్రకటించారు. తాను సైతం బ్యాడ్మింటన్ సంఘానికి రాజీనామా చేస్తానని చెప్పారు కేటీఆర్. కానీ మరొకసారి బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా యుగంధర్ రావు, వైస్ ప్రెసిడెంట్ గా చాముండేశ్వరినాథ్, జనరల్ సెక్రెటరీగా పుల్లెల గోపీచంద్, ట్రెజరర్ గా…
కోవిడ్ ఆర్థిక పరిస్థితులు, ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని, ఆ ఎఫెక్ట్ అమెరికా వంటి దేశాలతో పాటు భారత్ పై కూడా పడిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కొద్ది రోజుల కింద ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్రం ఛార్జీలు తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాట్ తగ్గించలేదు. అటల్ బిహారీ వాజ్ పేయి ఫౌండేషన్ స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బీజేపీ…
రాష్ట్రంలో ప్రజలందరూ అనేక సమస్యలతో బాధపడుతుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి మాత్రం దేశమంతా తిరుగుతున్నాడని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జిల్లా బీజేపీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఇబ్బందులను గుర్తించే స్థితిలో ముఖ్యమంత్రి లేడు. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 30 రూపాయల జీఎస్టీ విధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 65 వేల కోట్లు లబ్ధి…
తెలంగాణలోకి పెట్టుబడులు తెచ్చే విధంగా మంత్రి కేటీఆర్ యూకే పర్యటన సాగుతోంది. వివిధ కంపెనీల ప్రతినిధులను కలుస్తూ తెలంగాణ పెట్టుబడులకు అనువైన పరిస్థితులను గురించి వివరిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రెండో రోజు పలు కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. థామస్ లాయిడ్ గ్రూప్ ఎండీ నందిత సెహగల్ తుల్లీ మరియు సీనియర్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ లో కొనసాగుతున్న తమ కంపెనీ కార్యకలాపాల విస్తరణ పై చర్చించారు. పియర్సన్ కంపెనీ…
తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. చాలా చోట్ల వడ్లు కల్లాల్లో ఉండగా… వర్షాల వల్ల తడిసి పోయాయి. కనీసం వడ్లపై కప్పేందుకు టార్పలిన్ కవర్లు లేక రైతుల చాలా నష్టపోతున్నారు. మరోవైపు అకాల వర్షాల వల్ల మామిడి రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు, వడగండ్ల వల్ల మామిడి పూత రాలింది. అయితే సర్కార్ రైతుల ధాన్యం కొనుగోలు ఆలస్యం చేయడం వల్లే రైతులు నష్టపోతున్నారని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. తాజాగా టీపీసీసీ…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. వర్షానికి తడిసిన ధాన్యం వివరాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని కేటీఆర్ కు జిల్లా కలెక్టర్ వివరించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వాలని, జిల్లా కలెక్టర్ కు మంత్రి కేటీఆర్ సూచించారు. జిల్లాలోని ఎల్లారెడ్డి పేట, వీర్నపల్లి మండలాల…