పుడమిని రక్షించుకుందాం అని సద్గురు జగ్గీ వాసుదేవ్ పిలుపు ఇవ్వడంతో ప్రముఖులు కదలివచ్చారు. ఏటా సుమారు 27 వేల జీవ జాతులు అంతరించిపోతున్నాయి. సారవంతమైన భూమిలో కనీసం 3 నుంచి 6 శాతం సేంద్రియ పదార్థం ఉండాలి. కానీ.. భారత్ లోని భూముల్లో సుమారు 0.65 శాతం మాత్రమే సేంద్రియ పదార్థం ఉంది.
ఫ్రెంచ్ లో మట్టిని కాపాడుకునేందుకు పాలసీలు చేసినా ఆచరణలో మాత్రం ముందుకు కదలలేదు. మట్టిని కాపాడటం గురించి మన పిల్లలకు చెప్పడంకంటే ముందు.. మనం ఆచరించి చూపాలి. పర్యావరణంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ.. భూమిని కాపాడుకోవడం ప్రస్తుతం మన ముందు ఉన్న అత్యంత ముఖ్యమైన అంశం అన్నారు సద్గురు జగ్గీ వాసుదేవ్.
భూమిని ఇప్పుడు కాపడుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 2045 నాటికి ప్రజలకు కావాల్సిన ఆహార ఉత్పత్తి లేక ప్రపంచం కటకటలాడుతుంది. జీవం భూమినుంచే ప్రారంభం అవుతుంది. గత 30 ఏళ్లుగా భూమిని కాపాడుకోవడం పై నేను ఉద్యమిస్తున్నాను. కానీ ఈ అంశంపై ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. భూమి ఎడారి అవుతుంది అని అందరికీ తెలుసు…. దానికి పరిష్కారం కూడా అందరి దగ్గర ఉంది…కానీ ఎవరు పాటించడం లేదు.
జనవరిలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ జరిగినా… భూమిని కాపడుకోవాల్సిన అవసరం పై ఎవరు చర్చించలేదు. భూమిని కాపాడుకునేందుకు వేసవిలోనూ భూమిని కప్పి ఉంచే పంటలు సాగు చేయాలి. భూమిని కాపాడుకోకపోతే.. భవిష్యత్తులో 3మిలియన్ ల ప్రజలు మృతి చెందే ప్రమాదం ఉంది. భూమిని కాపాడుకునేఁదుకు వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.