తెలంగాణ ఏర్పడ్డ తరువాత కరెంటు కోత ఉండకుండా ఉండేందుకు నిర్మించిన పవర్ ప్రాజెక్టులపై వివాదాలు ముసురుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టుపై అధికార పార్టీలు అయిన టీఆర్ఎస్ బిజెపిల మధ్య వార్ కొనసాగుతుంది. ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ.. బీజేపీ ఆధ్వర్యంలోని శాఖల ఆధ్వర్యంలోనే పనులు జరిగాయి కదాఅని టీఆర్ఎస్ లు వాద ప్రతివాదాలు చేసుకుంటున్నారు.
కాగా.. తెలంగాణ ఏర్పడ్డ తరువాత తెలంగాణలో కరెంటు దొరకదని ఆనాడు ఆంధ్ర వాదులు, అక్కడి పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దానికి బిన్నంగా తెలంగాణ ఏర్పడ్డ తరువాత తెలంగాణలో కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఉంటే.. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం కరెంటు కోతలు నిరంతరం అయ్యాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహంలో బాగంగా ధర్మల్ పవర్ ప్రాజెక్టుల కోసం శ్రీకారం చుట్టారు. అందులోనిదే భద్రాద్రి పవర్ ప్రాజెక్టు.. గోదావరి నది సరిహద్దులో మణుగూర్ వద్ద భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై గత కొద్దిరోజుల నుంచి అటు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ , అదేవిదంగా టీఆర్ఎస్ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు వినోద్ లు మాటకు మాటలు అంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ నాయకుడు బండి సంజయ్ అన్నాడు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండు చేశారు. మద్యవర్తి ద్వారా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని బండి సంజయ్ చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ ప్రభుత్వం కూడ సీరియస్ గా తీసుకుంది.
బిజెపి చేస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ నాయకులు కూడ స్పందించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వాడిన యంత్ర సామాగ్రి అంతా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బి.ఎచ్.ఇ.ఎల్. నుంచి మాత్రమే కొనుగోలు చేశామని అన్నారు.
ఏడు వేల మెగావాట్ల విద్యుత్ నుంచి 24 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాదించేలా ముఖ్య 1,080 నాలుగు యూనిట్లు, నాలుగు టర్బైన్ 270మెగావాట్ల.. నాలుగు విద్యుత్ యూనిట్లు ఉత్పత్తి అవుతున్నాయి. పుల్ గా ఉత్పత్తి జరుగుతుంది.ప్రవేటు ఆపరేటర్లు ముందుకు వచ్చినప్పటికి మేమే ఉత్పత్తిని చేస్తామని ప్రభుత్వ రంగానికే ప్రాదాన్యత ఇచ్చారు. అంబానిలు, ఆదానీలకు ప్రాదాన్యతకు ఇవ్వకుండా ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుతున్నారు. తుప్పు పట్టిన యంత్రాలను సప్లై చేస్తే అది ఎవ్వరి తప్పు కేంద్ర ప్రభుత్వానికి చెందినది అయిన బి.ఎచ్.ఇ.ఎల్.ది తప్పా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద భద్రాద్రిపవర్ ప్లాంట్ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీల మధ్య వివాదంగా మారింది.
Chicago: చికాగోలో హీరోయిన్స్‌తో దందా.. దోషిగా తేలిన ఆ నిర్మాత!